Asianet News TeluguAsianet News Telugu

భారత విపణిలోకి రెనాల్ట్ ‘డస్టర్’.. బైక్, స్కూటర్ ధరలు పెంచిన హీరో


భారత విపణిలోకి డస్టర్ అప్ డేటెడ్ వర్షన్ కారును ఆవిష్కరించిన రెనాల్ట్.. క్యాప్చర్, క్విడ్ మోడల్ కార్ల రీప్లేస్‌మెంట్‌పై రూ.లక్షకు పైగా మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. 

Over Rs 1 lakh off on the Renault Duster, Captur, Kwid
Author
New Delhi, First Published Jul 9, 2019, 12:01 PM IST

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనాల్డ్ తన పాపులర్‌ ఎస్‌యూవీ డస్టర్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ తీసుకొచ్చింది. ఈ కొత్త కారును సోమవారం భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ. 8లక్షల నుంచి రూ. 12.5లక్షల వరకు ఉండనుంది. 

 

అప్‌డేటెడ్‌ వెర్షన్‌ డస్టర్‌లో యాపిల్‌ కార్‌ప్లే, వాయిస్‌ రికగ్నిషన్‌తో ఆండ్రాయిడ్‌ ఆటో ఇన్ఫోటెయిన్‌మెంట్‌, ఎకోగైడ్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ సహా 25 అధునాతన సాంకేతిక ఫీచర్లు ఉన్నట్లు రెనాల్ట్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో ఈ కారును రూపొందించినట్లు పేర్కొంది. ఈ నెల అంతటా క్యాప్చర్, క్విడ్ మోడల్ కార్ల రీప్లేస్‌మెంట్‌పై డిస్కౌంట్లు అందజేయనున్నట్లు రెనాల్ట్ తెలిపింది.

 

ఈ సందర్భంగా రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్‌ సీఈవో వెంకటరామ్‌ మామిళ్లపల్లి మాట్లాడుతూ ‘మా ఉత్పత్తుల్లో డస్టర్‌ చాలా కీలకమైన మోడల్‌. దీనికి వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అప్‌డేటెడ్‌ వెర్షన్‌కు కూడా మంచి డిమాండ్‌ ఉంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. భారతదేశంలో వ్యూహాత్మకంగా విస్తరిస్తామని చెప్పారు. 
ఐకానిక్ రెనాల్ట్ డస్టర్ 17.64 సెం.మీ. టచ్ స్క్రీన్ మీడియా నావ్ ఎవల్యూషన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ రికగ్నిషన్ తదితర ఫీచర్లు కలిగి ఉంది. కాస్పయిన్ బ్లూ, మహోగనీ బ్రౌన్ రంగుల్లో లభ్యం కానున్నది. 

 

అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న రెనాల్ట్, భారతదేశ విపణిలో ప్రవేశపెట్టిన అప్ డేటెడ్ డస్టర్ కారును దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దారు. న్యూ ట్రై వింగ్డ్ ఫుల్ క్రోమ్ గ్రిల్లె, న్యూ డ్యూయల్ టోన్ బాడీ కలర్ ఫ్రంట్ బంపర్, మస్క్యులర్ స్కిడ్ ప్లేట్స్, న్యూ సిగ్నేచర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తదితర ఫీచర్లు అనుసంధానించారు.    

 

మరింత ప్రియం కానున్న హీరో బైక్స్‌, స్కూటర్లు 
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ తన వాహన శ్రేణిలోని మోటర్‌ సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రతి వాహనంపై ఒక శాతం మేర ధరను పెంచుతున్నట్లు సోమవారం తెలిపింది. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. 'ద్విచక్రవాహన శ్రేణిలోని అన్ని బైక్‌లపై ఒక శాతం ధరను పెంచుతున్నాం. మోడల్‌, ప్రత్యేకతల ప్రకారం ఈ ధరల్లో మార్పు ఉండవచ్చు' అని హీరో మోటోకార్ప్‌ తెలిపింది. అయితే, ఎందుకు ధరలు పెంచుతున్నారో మాత్రం వెల్లడించలేదు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యానికి తోడు బడ్జెట్‌లో వివిధ ఆటోమొబైల్‌ పరిశ్రమ సామగ్రిపై పన్నులు పెంచిన నేపథ్యంలోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందన్న విశ్లేషకులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios