Ola CEO Dances: ఓలా సీఈవో డ్యాన్స్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌..!

ఓలా స్కూటర్‌ యూజర్లకు ఆ కంపెనీ సీఈవో భవిశ్‌ అగర్వాల్‌ శుభవార్త చెప్పారు. గత ఆర్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక ఫీచర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించారు. అతి త్వరలోనే యూజర్లకు మూవ్‌ఓఎస్‌2 అప్‌డేట్‌ అన్‌లాక్ అవుతుందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ పాట‌కు చేసిన డ్యాన్స్ నెట్టింట వైర‌ల్ అయ్యింది.
 

Ola CEO Dances To Bijlee Bijlee

సంగీతం ఇచ్చే కిక్కు ఇంకేదీ ఇవ్వదు ఈ ప్రపంచంలో. అందుకే దానికి కులం, మతం, వర్గం, ప్రాంతం అన్నది ఉండదు. సోషల్ మీడియా వచ్చాక ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో.. ఇంకెప్పుడు స్టార్లుగా మారుతారో చెప్పలేం. సామాన్యులు డ్యాన్సు చేస్తే ఎవరూ పట్టించుకోరు. అదే సెలబ్రిటీలు, సిఈవోలు ఐకాన్స్ చేస్తే వెంటనే హాట్ టాపిక్ గా మారిపోతుంది. తాజాగా ఓలా కంపెనీ సిఈవో భవిష్ అగర్వాల్ వైరల్ గా మారారు.

 

ఎందుకంటే ఆయన ఉన్నట్టుండి ఓ పాట‌కు ఊగిపోయారు. డ్యాన్సుతో హోరెత్తించారు. ఎందుకంటే తనను అంతగా ఇంప్రెస్ కు గురి చేసిన ఒకే ఒక్క పాట. అది బిజిలీ బిజిలీ సాంగ్. తాను డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆయనే స్వంతంగా ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది హల్ చల్ చేస్తోంది. ప్రధాన కంపెనీలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల జపం చేస్తున్నాయి. టెస్లా సీఈవో ఎలాన్‌ మ‌స్క్‌ నుంచి ఓలా.. ఉబ‌ర్ కంపెనీలన్నీ విద్యుత్ వాహనాలపై ఫోకస్ పెట్టాయి.

తాజాగా ఓలా సైతం బ్యాటరీల సాయంతో నడిచే స్కూటర్లకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కంపెనీ తీసుకు వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను వినియోగదారులకు అందించనున్నారు. దీని కోసమే బిజిలీ బిజిలీ అంటూ డ్వాన్స్ చేశారు సీఈవో భ‌విష్ అగర్వాల్ . బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది ఈ వాహనానికి. ఎంచక్కా సంగీతం వింటూ హాయిగా జర్నీ చేసేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకువచ్చారు ఓలా కంపెనీ వారు. 

ఓలా స్కూటర్‌ ప్రీ పొడక్ష‌న్‌లో ఉండగానే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. లక్షన్నర ప్రీ బుకింగ్స్‌తో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన బూమ్‌తో స్కూటర్‌ డెలివరీ ఒ‍త్తిడిలో పడిపోయింది ఓలా సంస్థ. ఆగష్టు 15న ప్రీ బుకింగ్స్‌ ప్రారంభమైతే అక్టోబరు చివరి వారం నాటికి గానీ డెలివరీ చేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా కస్టమర్లకు బైకులు డెలివరీ అవుతున్నాయి. అయితే యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్‌లో లాక్‌మోడ్‌లోనే ఉండిపోయాయి. డిజిటల్‌ కీ, మూవ్‌ఓస్‌ లాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. క్రమంగా ఒక్కో ఫీచర్‌ను అన్‌లాక్‌ చేస్తూ వస్తోంది ఓలా. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఓలాను చుట్టుముట్టాయి. ఈ తరుణంలో భవీశ్‌ అగర్వాల్‌ త్వరలోనే మూవ్‌ఓస్‌ 2 అందుబాటులోకి వస్తోందంటూ ట్వీట్‌ చేశాడు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios