Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్...అతి తక్కువ ధరకే...

ఒకినావా స్కూటర్స్ నుంచి విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-లైట్ వచ్చేసింది. దీని ధర రూ.59,990గా నిర్ణయించారు.  

Okinawa Scooters launches Lite at Rs 59,990
Author
Hyderabad, First Published Nov 8, 2019, 11:45 AM IST

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒకినావా స్కూటర్స్ గురువారం సరికొత్త స్లో స్పీడ్ ఈ-స్కూటర్‌ ‘లైట్’ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.59,990గా నిర్ణయించింది. ఇందులో లిథియం ఐయాన్ బ్యాటరీని ఉపయోగించారు.

మోటార్, బ్యాటరీపై కంపెనీ మూడేళ్ల వారెంటీ ఆఫర్ చేస్తోంది. బ్యాటరీని ఎవరూ దొంగిలించకుండా యాంటీ థెఫ్ట్ బ్యాటరీ లాక్‌ ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ హెడ్ లైట్, ఎల్ఈడీ వింకర్స్, ఎల్‌ఈడీ స్పీడోమీటర్, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ హ్యాండిల్, సెల్ఫ్ స్టార్ట్ పుష్ బటన్, స్టీల్ ఫ్రేమ్ బాడీతో ముందువైపు సస్పెన్సన్ వంటివి ఉన్నాయి.

also read ఇండియన్లకు MVPపై మోజు.. 11 సెకన్లలో వీ-క్లాస్ ఎలైట్..రూ.1.10 కోట్లు

యువతను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ స్కూటర్‌ను ఒకినావా తీర్చిదిద్దింది. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో అనువుగా ఉంటుందని ఒకినావా ఆటోటెక్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్ శర్మ తెలిపారు. గత మూడేళ్లలో తమ కంపెనీ నుంచి రిడ్జ్, ప్రైజ్, రిడ్జ్ ప్లస్, ఐప్రైజ్ ప్లస్, ప్రైజ్ ప్రొ వంటి స్కూటర్లను తీసుకొచ్చినట్టు తెలిపారు. 

ఒకినావా ఈ-లైట్ స్కూటర్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని సంస్థ ఎండీ జితేందర్ శర్మ చెప్పారు. లిథియాన్ బ్యాటరీని అంతర్గతంగా లాక్ చేస్తుంది. ఎల్ఈడీ స్పీడో మీటర్, సెల్ఫ్ స్టార్ట్ పుష్ బటన్, రెక్టాంగ్యులర్ టైప్ ఫ్రంట్ సస్పెన్షన్ వసతులు అందుబాటులో ఉన్నాయి. 

aslo read  విపణిలోకి తొలి బీఎస్-6 బైక్...

ఒకినావా లైట్ స్కూటర్‌లో 250 వాట్, 40 వాట్ల 1.25 కిలోవాట్ల లీథియం ఐయాన్ బ్యాటరీతో కూడిన బీఎల్డీసీ మోటార్ (వాటర్ ప్రూఫ్) ఎలక్ట్రిక్ మోటారు రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 25 కి.మీ. వేగంతో వెళ్లడంతోపాటు పూర్తిస్థాయిలో చార్జింగ్ చేస్తే 50-60 కి.మీ. వరకు ప్రయాణం చేయొచ్చు. అల్యూమినియం అల్లాయ్ వీల్స్, ఏ-ఏబీఎస్, రీ జనరేటివ్ బ్రేకింగ్ ఫంక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios