ముంబై: ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్’ ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా భారతదేశ తొలి మోటారు సైకిల్ ‘స్పెండర్ 110 సీసీ ఐస్మార్ట్’ పేరుతో విపణిలోకి విడుదలచేసింది. దీని ధర రూ .64,900గా ఖరారు చేసింది.

మరికొన్ని రోజుల్లో  ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో ‘హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్’ రిటైల్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ప్రజల నుంచి వచ్చే డిమాండ్, గిరాకీని బట్టి దశల వారీగా రాబోయే కొద్ది వారాల్లో ఇది క్రమంగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది ఈ బైక్.

also read  టొయోటా నుంచి కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూ‌వి కార్

భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో తాజా ఆవిష్కరణతో తన మార్కెట్ షేర్ మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈ మోటారు సైకిల్‌లో 110 సీసీ  బీఎస్-6 కంప్లైంట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్ అమర్చారు. 9 గరిష్ట బీహెచ్పీ వద్ద 7500 ఆర్పీఎం శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5500 ఆర్పీఎం వద్ద 9.89 ఎన్ఎం టార్చ్‌ను అందిస్తుంది. 

స్ప్లెండర్ ఐస్మార్ట్ దేశవ్యాప్తంగా దశలవారీగా అందుబాటులో ఉంటుందని హీరో మోటోకార్ప్  ప్రతినిధి సంజయ్ భన్ తెలిపారు. పాత మోడల్ బైక్ కంటే అధిక టార్చ్, మైలేజీని ఇస్తుందీ స్పెండర్ 110 సీసీ ఐస్మార్ట్. బీఎస్-4లో మాదిరిగానే స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్‌లోనూ ఐ3ఎస్ (ఐడిల్ స్టార్ట్ సాఫ్ట్ సిస్టం) అమర్చారు. 

వీల్ బేస్, ఫ్రంట్ సస్పెన్షన్‌ల్లో స్వల్ప మార్పులు చేశారు. దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రపంచంతో సమానంగా ఉండే బీఎస్-6 ఉద్గార నిబంధనలు 2020 ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమలులోకి రానున్నసంగతి తెలిసిందే.

also read అప్రిలియా ఆర్‌ఎస్ 660 : సూపర్‌ స్పోర్ట్ క్లాస్‌ బైక్

సెల్ఫ్ డ్రమ్ కాస్ట్, సెల్ప్ డిస్క్ కాస్ట్ అనే రెండు వేరియంట్లలో ఈ బైక్ లభ్యం కానున్నది. టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్- బ్లాక్, ఫోర్స్ సిల్వర్, హెవీ గ్రే రంగుల్లో వినియోగదారులకు ఈ బైక్ అందుబాటులోకి వస్తుంది.

ఈ బైక్ ఇంజిన్‌ను రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ (సీఐటీ)లో అభివృద్ధి చేశారు. బైక్ పనితీరు సామర్థ్యం, స్టెల్, రైడింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా మెరుగు పరిచాం` అని సంస్థ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అధిపతి మాలో లే మాసన్ తెలిపారు.