ఇండియన్లకు MVPపై మోజు.. 11 సెకన్లలో వీ-క్లాస్ ఎలైట్..రూ.1.10 కోట్లు

మల్టీ పర్పస్ వెహికల్స్‌పై ఇండియన్ యువతకు మోజెక్కువ. దీన్ని గమనించినందునే మెర్సిడెజ్-బెంజ్ కారు 11 సెకన్లలో 100 కి.మీ. వేగం అందుకునే ‘వీ-క్లాస్ ఎలైట్’కారును ఆవిష్కరించింది. 

Mercedes-Benz rolls out V-Class Elite at Rs 1.10 cr

చెన్నై: జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురువారం తన కొత్త  వి-క్లాస్ ఎలైట్ మోడల్ కారును విడుదల చేసింది. ప్రీమియం  లగ్జరీ సెగ్మెంట్‌పై కన్నేసిన బెంజ్ మల్టీ పర్సస్ వెహికల్‌ను తీసుకొచ్చింది. వీ-క్లాస్ ఎక్స్ప్రెషన్ , వి-క్లాస్ ఎక్స్క్లూజివ్ కార్లకు అప్‌డేటెడ్ వెర్షన్‌గా వీ-క్లాస్ ఎలైట్స్‌ కారును ఆవిష్కరించింది. 

స్పెయిన్‌లో రూపొందించిన వీ-క్లాస్ ఎలైట్, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ  మార్టిన్ ష్వెంక్ చెప్పారు. లగ్జరీ ఎంపీవీ ధర రూ.1.10 కోట్లుగా నిర్ణయించింది సంస్థ. వీ-క్లాస్ ప్రొడక్ట్ రేంజ్ వీ-క్లాస్ ఎక్స్ప్రెషన్ ధర రూ .68.40 లక్షలకు, వీ -క్లాస్ ఎక్స్‌క్లూజివ్ రూ .81.90 లక్షలకు లభిస్తాయి. 

also read మహీంద్రా XUV 300 రీకాల్ : సస్పెన్షన్ భాగాలే కారణం

వీటితోపాటు వీక్లాస్ ఎలైట్ అందుబాటులో ఉంటుందని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ  మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ప్రతి నెలా కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు కంపెనీ చూస్తోందని అన్నారు. లగ్జరీ మార్కెట్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు.

Mercedes-Benz rolls out V-Class Elite at Rs 1.10 cr

భారతదేశంలో మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బెంచ్ ఈ కారును విపణిలోకి తెచ్చింది. గతంలో విడుదల చేసిన వీ క్లాస్ మోడల్ కారుకు కొనసాగింపుగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. 

Mercedes-Benz rolls out V-Class Elite at Rs 1.10 cr

సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మసాజ్ ఫంక్షన్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సీట్లు సహా, కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వి-క్లాస్ ఎలైట్‌లో ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ లాంటి ఫీచర్లు పొందుపర్చినట్టు చెప్పారు.  

also read ఫెస్టివ్ స్పార్క్ మిస్సింగ్.... బీఎస్6 ఎఫెక్టేనా?!

ఈ కారు స్టయిల్ పరంగా బంపర్, హెడ్ ల్యాంప్, గ్రిల్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిని ఆధునీకరించారు. స్టీల్ బ్లూ, సెలెనైట్ గ్రే, గ్రాఫ్లైట్ గ్రే రంగుల్లో ఈ కారు లభించనున్నది. ఈ కారు కేవలం 11 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇందులో సెంట్రల్ కన్సోల్‌లో చిన్నపాటి రిఫ్రిజిరేటర్ కూడా అమర్చారు.

కమాండ్ ఆన్ లైన్ ఇంటర్ ఫేస్ ఇన్ఫోటైన్మెంట్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు జత కలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ఆరు ఎయిర్ బ్యాగులు చేర్చారు. వీటితోపాటు ఏబీఎస్, ఈబీడీ, అటెన్షన్ అసిస్ట్, 360 – డిగ్రీ కెమెరా, పార్కింగ్ అసిస్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios