సచిన్ టెండూల్కర్, జాన్ అబ్రాహం ఫేవరెట్ కారు.. ఇండియన్ మార్కెట్ నుండి ఔట్ కారణం ఏంటంటే..?
మీడియా నివేదికల ప్రకారం, నిస్సాన్ జిటిఆర్ వంటి బెస్ట్ స్పోర్ట్స్ కారు అఫిషియల్ వెబ్‌సైట్ నుండి తొలగించింది. మరోవైపు కంపెనీ ఈ కారును నిలిపివేసిందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియన్ వెబ్‌సైట్ నుండి నిస్సాన్ జిటిఆర్ ను డి-లిస్ట్ చేసినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. అన్నింటికంటే కంపెనీ అత్యుత్తమ స్పోర్ట్స్ కారును ఎందుకు వెబ్‌సైట్ నుండి తొలగించాలని నిర్ణయించుకుంది అనేది ఆశ్చర్యకంగానే ఉంది.
కంపెనీ జిటిఆర్ ని ఎందుకు తీసివేసిందంటే
మీడియా నివేదికల ప్రకారం, నిస్సాన్ జిటిఆర్ వంటి బెస్ట్ స్పోర్ట్స్ కారు అఫిషియల్ వెబ్‌సైట్ నుండి తొలగించింది. మరోవైపు కంపెనీ ఈ కారును నిలిపివేసిందని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నివేదికల ప్రకారం జిటిఆర్ లాంచ్ చేసిన 15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో కూడా నిలిపివేయబడింది.
జిటిఆర్ ఎందుకు నిలిపివేసింది
నివేదికల ప్రకారం, కాలుష్యానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొత్త ఉద్గార నియమాలు రూపొందించబడుతున్నాయి. భారత్‌లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త వాహన ఉద్గార నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే వాహన కంపెనీలు ప్రస్తుత డీజిల్ కార్ వేరియంట్‌లను విక్రయించడానికి ఇంజిన్‌ను మెరుగుపరచాలి. ఇలా చేయడం వల్ల భారీ మొత్తంలో నష్టం ఇంకా 2023 సంవత్సరం ముందే కొన్ని కంపెనీలు కొన్ని వేరియంట్‌లను కూడా తీసివేస్తున్నాయి. ఈ కారణంతో ప్రస్తుత GTRని కూడా నిస్సాన్ మార్కెట్ నుండి తొలగించే అవకాశం ఉంది.
ఇప్పుడు రెండు కార్లు మాత్రమే
భారతదేశంలో నిస్సాన్ కంపెనీ నుండి ఇప్పుడు రెండు కార్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లలో కాంపాక్ట్ SUV మాగ్నైట్ అండ్ మిడ్-సైజ్ SUV కిక్స్ ఉన్నాయి.
సచిన్ అండ్ జాన్ అబ్రాహం
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం వంటి సెలబ్రిటీలకు ఈ కారు బెస్ట్ ఆప్షన్ అండ్ ఇష్టమైన కారుగా ఉంది. ఈ సెలబ్రిటీలు నిస్సాన్‌కు చెందిన ఈ విలాసవంతమైన కారును సొంతం చేసుకున్నారు. ఫెరారీని విక్రయించిన తర్వాత సచిన్ టెండూల్కర్ నిస్సాన్ GTRని కొనుగోలు చేశాడు. అదే సమయంలో జాన్ అబ్రహం కూడా ఈ కారును నడుపుతూ కనిపించాడు.
మంచి లుక్
నివేదికల ప్రకారం, కంపెనీ మెరుగైన లుక్ తీసుకురావాలని యోచిస్తోంది. దీని బెటర్ అండ్ అప్ డెటెడ్ వెర్షన్ రానున్న కొద్ది నెలల్లో గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. కొత్త జిటిఆర్‌ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన తర్వాత భారతదేశానికి కూడా తీసుకురావాలని భావిస్తున్నారు.
ఇండియా ఒక ముఖ్యమైన మార్కెట్
నిస్సాన్ ప్రకారం, ఇండియా చాలా ముఖ్యమైన మార్కెట్. ప్రస్తుతం కంపెనీ భారత్‌లో కేవలం రెండు కార్లను మాత్రమే విక్రయిస్తోంది. అయితే రాబోయే నెలల్లో కంపెనీ కొత్త కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చు. నివేదికల ప్రకారం, కంపెనీ కొత్త SUVని వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టవచ్చు. నిస్సాన్ మాగ్నైట్ విజయం తర్వాత ఏడు సీట్ల వెర్షన్‌ను కూడా తీసుకురావచ్చు.