Asianet News TeluguAsianet News Telugu

దేశీయంగానే బీఎండబ్ల్యూ కార్ల ఉత్పత్తి.. విపణిలోకి న్యూ బీఎండబ్ల్యూ 3 సిరీస్


జర్మనీలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయంగానే కార్లను ఉత్పత్తి చేస్తోంది. తాజాగా విడుదల చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ కార్ల ధరలు రూ.41.4-46.9 లక్షల మధ్య ఉంటాయి. 

New-Gen BMW 3 Series Launched In India Prices Start At  41.40 Lakh
Author
Hyderabad, First Published Aug 22, 2019, 2:08 PM IST

న్యూఢిల్లీ: జర్మనీ విలాసవంత కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దేశీయ విపణిలోకి సెడాన్‌ 3 సిరీస్‌లో సరికొత్త వెర్షన్‌ను బుధవారం ఆవిష్కరించింది. గత వెర్షన్లతో పోలిస్తే ఈ కొత్త కారు బరువు 55 కిలోలు తక్కువ ఉంటుంది. కారు లోపలి వైశాల్యం పెరిగింది. ధర రూ.41.4- 47.9 లక్షల మధ్య ఉంది. బీఎండబ్ల్యూ 330ఐ, బీఎండబ్ల్యూ 320డీ ఇంజిన్లతో ఈ వెర్షన్‌ అందుబాటులోకి తెచ్చారు. 

స్పోర్ట్‌, లగ్జరీ లైన్‌, ఎం స్పోర్ట్‌ వేరియంట్లలో 3 సిరీస్‌ లభిస్తోంది. ఎం స్పోర్ట్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కాగా మిగతా వాటిలో డీజిల్‌ ఇంజిన్లు ఉన్నాయి. డీజిల్‌ కార్ల ధర రూ.41.4 లక్షలు, రూ.46.9 లక్షలు కాగా పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ.47.9 లక్షలుగా నిర్ణయించారు.

బీఎండబ్ల్యూకు 3 సిరీస్‌ ఆత్మలాంటిదని ఆ సంస్థ భారత అధ్యక్షుడు, సీఈవో రుద్రతేజ్‌ సింగ్‌ తెలిపారు. ఇది డ్రైవర్‌, రహదారి, మెషిన్‌ మధ్య అంతులేని సామరస్యం కలిగిస్తుందన్నారు. ‘అంతర్జాతీయ, భారత విపణిలో 3 సిరీస్‌ వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. భారత్‌లో మేం విక్రయిస్తున్న ప్రతి మూడు కార్లలో ఒకటి 3 సిరీసే’ అని ఆయన హర్షంవ్యక్తం చేశారు. 

సరికొత్త కారులో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, ఆపిల్‌ కార్‌ప్లే  ఇన్ఫోటైన్‌మెంట్‌, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్, భద్రత కోసం 6 ఎయిర్‌ బ్యాగులు ఉన్నాయి. 3 సిరీస్‌ కార్లను చెన్నై ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. బీఎండబ్ల్యూ 330ఐ కారు 1998 సీసీ 4- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌, బీఎండబ్ల్యూ 320డీ కారులో 1995 సీసీ 4-సిలిండర్ ఆయిల్ బర్నర్‌లో డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. 

బీఎండబ్ల్యూ 330ఐ కారు 5000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 255 బీహెచ్పీ, 1550-4400 ఆర్పీఎం మధ్య 400 ఎన్ఎం టార్చిని అభివ్రుద్ధి చేస్తుంది. బీఎండబ్ల్యూ 320డీ కారు 1750-2500 ఆర్పీఎం మధ్య 400 ఎన్ఎం టార్చి, 4000 ఆర్పీఎం వద్ద 188 బీహెచ్పీ విడుదల చేసింది. 

న్యూ 8 సిరీస్ నుంచి లార్జర్ కిడ్నీ గ్రిల్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ షేప్డ్ డే టైం రన్నింగ్ లైట్స్, బీఎండబ్ల్యూలో ఫేమ్ అయిన హోఫ్ మైస్టర్ కింగ్ డిజైన్, తలుపుకు బదులు సీ-పిల్లర్, రోల్స్ రాయిస్ కార్ల తరహా వీల్స్, న్యూ 5 సిరీస్‌తో పోలిస్తే సెడాన్ కారులా కనిపించే ఏర్పాట్లు చేశారు. బీఎండబ్ల్యూ 320డీ కారు 17 అంగుళాల లైట్ అల్లాయ్ వీల్స్, 330ఐ కారులో 18 అంగుళాల లైట్ అల్లాయ వీల్స్ అమర్చారు. 

కారు లోపల స్పేసియస్‌గానూ, డ్రైవర్ ఫోకస్డ్ కాక్ పిట్, డోర్స్ వరకు హైలీ క్వాలిటీ ఎలక్రోప్లేటెడ్ ట్రిమ్ స్ట్రిప్స్ అండ్ కౌంటర్స్ పొడిగింపు, హెచ్‌యూడీతో ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్, మెమొరీ సీట్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, కీ లెస్ ఎంట్రీ, 8-8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్ తదితర వసతులు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios