ఇండియాలోకి బిఎండబల్యూ కొత్త ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవి.. ఈ లగ్జరీ కార్ సెకన్లలోనే టాప్ స్పీడ్.. ఫీచర్స్ అదుర్స్.
భారతదేశంలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.22 కోట్ల నుండి రూ. 1.24 కోట్లకు ఉంటుంది. ఈ ఎస్‌యూవి బుకింగ్‌లు జనవరి 17 నుండి బిఎండబల్యూ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి అయితే కారు డెలివరీలు 2023 మొదటి త్రైమాసికం చివరి నాటికి ప్రారంభమవుతాయి.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎండబల్యూ భారత మార్కెట్లో కొత్త 2023 బిఎండబల్యూ ఎక్స్7 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవిని లాంచ్ చేసింది. ఈ పవర్ ఫుల్ లగ్జరీ ఎస్‌యూవి బిఎండబల్యూ ఎక్స్7 ఫేస్‌లిఫ్ట్ రెండు వేరియంట్‌లలో పరిచయం చేసారు - xDrive40i M స్పోర్ట్ అండ్ xDrive40d M స్పోర్ట్. అప్ డెటెడ్ బిఎండబల్యూ ఎక్స్7 ఇండియాలోని చెన్నై ప్లాంట్‌లో స్థానికంగా నిర్మించారు.
ధర అండ్ డెలివరీ
భారతదేశంలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.22 కోట్ల నుండి రూ. 1.24 కోట్లకు ఉంటుంది. ఈ ఎస్‌యూవి బుకింగ్‌లు జనవరి 17 నుండి బిఎండబల్యూ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి అయితే కారు డెలివరీలు 2023 మొదటి త్రైమాసికం చివరి నాటికి ప్రారంభమవుతాయి.
లుక్ అండ్ డిజైన్
బిఎండబల్యూ ఎక్స్7 డిజైన్ గొప్పగా అప్ డేట్ చేశారు. ఈ ఎస్‌యూవి 5 కలర్స్ ఆప్షన్స్ లో వస్తుంది. ఇందులో మినరల్ వైట్, బ్లాక్ సఫైర్, కార్బన్ బ్లాక్ వంటి కలర్స్ ఉన్నాయి. అదనంగా ఈ ఎస్‌యూవి రెండు ప్రత్యేకమైన బిఎండబల్యూ పెయింట్‌వర్క్‌లలో కూడా అందుబాటులో ఉంది - ద్రవిట్ గ్రే అండ్ టాంజానైట్ బ్లూ. క్యాబిన్ లోపల ఎస్‌యూవి స్పోర్ట్స్ ఎక్స్‌క్లూజివ్ బిఎండబల్యూ ఇండివిజువల్ లెదర్ మెరినో అప్హోల్స్టరీ మూడు షేడ్‌లలో లభిస్తుంది - టార్టుఫో, ఐవరీ వైట్ ఇంకా బ్లాక్.
కొత్త బిఎండబల్యూ ఎక్స్7కి బ్లాక్ కలర్లో పెయింట్ చేసిన ఆకట్టుకునే ఫ్రంట్ కిడ్నీ గ్రిల్ ఉంది, దీనిని కొత్తగా రూపొందించిన స్లిక్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌ల ద్వారా మరింత మెరుగుపరచబడింది. ఇతర డిజైన్ ఎలిమెంట్స్ తో పాటు కొత్త ఇన్నర్ గ్రాఫిక్స్‌తో క్రోమ్ గార్నిష్డ్ ఎయిర్ వెంట్‌లు, 3D టెయిల్‌లైట్‌లను కూడా పొందుతుంది.
కారు క్యాబిన్ గురించి మాట్లాడితే కొత్త 2023 బిఎండబల్యూ ఎక్స్7 ఎస్‌యూవి ఫ్రీస్టాండింగ్ బిఎండబల్యూ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, iDrive 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే 14.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇతర ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, స్కై లాంజ్ పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే, ADAS ఉన్నాయి.
ఇంజిన్ పవర్ అండ్ గేర్ ట్రాన్స్‌మిషన్
2023 బిఎండబల్యూ ఎక్స్7 మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన రెండు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. బిఎండబల్యూ ఎక్స్7 xDrive40i M స్పోర్ట్ వేరియంట్ 3.0-లీటర్, 6-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 5,200-6,250 ఆర్‌పిఎం వద్ద 375 బిహెచ్‌పి శక్తిని, 1,850-5,000 ఆర్‌పిఎం వద్ద 520 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బిఎండబల్యూ ఎక్స్7 xDrive40d M స్పోర్ట్ వేరియంట్‌లో 3.0-లీటర్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 4,400 ఆర్‌పిఎం వద్ద 335 బిహెచ్‌పి పవర్, 1,750-2,250 ఆర్‌పిఎం వద్ద 700 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
48V ఎలక్ట్రిక్ మోటార్ అదనంగా 12hp శక్తిని, 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్, బిఎండబల్యూ xDrive ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.
స్పీడ్
బిఎండబల్యూ ఎక్స్7 xDrive40i M స్పోర్ట్ 5.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. బిఎండబల్యూ ఎక్స్7 xDrive40d M స్పోర్ట్ 5.9 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది. ఈ SUV ఫోర్ డ్రైవ్ మోడ్‌లను పొందుతుంది - కంఫర్ట్, ఎఫిషియెంట్, స్పోర్ట్ ఇంకా స్పోర్ట్ ప్లస్.
బిఎండబల్యూ ఎక్స్7 ఫేస్‌లిఫ్ట్ మెర్సిడ్స్ బెంజ్ జిఎల్‌ఎస్ తో పోటీపడుతుంది. ఎక్స్7 కాకుండా, బిఎండబల్యూ కొన్ని రోజుల క్రితం M340i అండ్ XMలను కూడా భారత మార్కెట్లో లాంచ్ చేసింది.