హోండా నుండి కొత్త 125సిసి యాక్టివా మార్కెట్ లోకి విడుదల

New 2018 Honda Activa 125 Launched In India
Highlights

ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా నుండి మరో కొత్త మోడల్ స్కూటీ ఇండియన్ మార్కెట్ లో విడుదలైంది. ఎలాంటి హడావుడీ లేకుండా న్యూ 2018 యాక్టివా 125 ని హోండా కంపెనీ లాంచ్ చేసింది. 

ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా నుండి మరో కొత్త మోడల్ స్కూటీ ఇండియన్ మార్కెట్ లో విడుదలైంది. ఎలాంటి హడావుడీ లేకుండా న్యూ 2018 యాక్టివా 125 ని మార్కెట్ లోకి హోండా కంపెనీ లాంచ్ చేసింది. ఈ స్కూటీ డిల్లీ ఎక్స్ షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి.

యాక్టివా 125 స్టీల్ వీల్ తో పాటు డ్రమ్ బ్రేకర్స్ మోడల్ ధర రూ.59,621

యాక్టివా 125 మిశ్రమ లోహంతో కూడిన వీల్ తో పాటు డ్రమ్ బ్రేకర్స్ మోడల్ ధర రూ.61,558

యాక్టివా 125 మిశ్రమ లోహంతో కూడిన వీల్స్ తో పాటు డిస్క్ బ్రేక్  వాహనం ధర రూ.64,007 లుగా నిర్ణయించారు.  

ఈ కొత్త వాహనంలో అధునాతన సౌకర్యవంతమైన సదుపాయాలను కల్పించడం జరిగింది. ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్స్ తో పాటు 4 ఇన్ 1 సీట్ ఓపెనింగ్ స్విచ్, అధునాతన ఇండికేటర్లు, ప్రంట్ డిస్క్ బ్రేక్ వంటి సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పించి వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు రూపొందించినట్లు హోండా కంపనీ ప్రకటించింది.
 
ఈ మోడల్ స్కూటీ ఐదు రంగుల్లో మార్కెట్లో అందుబాటులో  ఉంది. నలుపు, ముత్యపు తెలుపు,సిల్వర్ కలర్, నీలి, రెబల్ రెడ్ కలర్లతో అందుబాటులో ఉన్నాయి.
 

loader