ఓలా ఇ-స్కూటర్ వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ అప్ డేట్ తో మరిన్ని ఫీచర్స్ అన్‌లాక్‌ చేస్తూ సి‌ఈ‌ఓ ట్వీట్..

ఆపరేటింగ్ సిస్టమ్ దాదాపు సిద్ధంగా ఉందని, ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేస్తామని అగర్వాల్ చెప్పారు. అయితే ఇంతకుముందు యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్‌లో లాక్‌మోడ్‌లోనే ఉండిపోయాయి. 
 

MoveOS 2.0 almost ready: Bhavish Aggarwal gives update on Ola escooter operating system

ఇండియన్ మల్టీ నేషనల్ రైడ్ షేరింగ్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ - MoveOS 2.0ని ఓలా సహ వ్యవస్థాపకుడు అండ్ సి‌ఈ‌ఓ భవిష్ అగర్వాల్ నేడు ప్రకటించారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ దాదాపు సిద్ధంగా ఉందని, ఏప్రిల్ చివరి నాటికి విడుదల చేస్తామని అగర్వాల్ చెప్పారు.

ఆపరేటింగ్ సిస్టమ్ దానితో పాటు తీసుకురానున్న ముఖ్య ఫీచర్స్ గురించి కూడా వెల్లడించారు. అయితే యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్‌లో లాక్‌మోడ్‌లోనే ఉండిపోయాయి. డిజిటల్‌ కీ, మూవ్‌ఓస్‌ లాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. క్రమంగా ఒక్కో ఫీచర్‌ను అన్‌లాక్‌ చేస్తూ వస్తోంది ఓలా.

“MoveOS 2.0 దాదాపు సిద్ధంగా ఉంది ఇంకా ప్రతి ఒక్కరికీ ఏప్రిల్ చివరిలో  అందుబాటులోకి వస్తుంది. దీని ముఖ్యమైన  ఫీచర్స్ : నావిగేషన్, కంపానియన్ యాప్, క్రూయిజ్ కంట్రోల్, బ్లూటూత్,  పర్ఫర్మెంస్ మెరుగుదలలు ఇంకా మరెన్నో..! అని అగర్వాల్ ట్వీట్ చేశారు.  ఓలా S1 ప్రో మరో కొత్త కలర్ వేరియంట్ అంటే కుంకుమపువ్వు లేదా గెరువా కలర్ లో వస్తోందని అగర్వాల్ ఈ వారం ప్రారంభంలో ట్వీట్ చేశారు. 

“డెలివరీల మధ్య ఓలా ఎలక్ట్రిక్ మార్కెటింగ్ బృందం మా హోలీ ప్లాన్‌ను కనుగొన్నారు! ఇప్పుడు S1 ప్రోని అందమైన కొత్త రంగులో లాంచ్ చేస్తోంది !! అని అగర్వాల్ ట్వీట్ చేశారు. కస్టమర్ ఫిర్యాదులు, ఒత్తిడి పెరిగిన తర్వాత Ola ఇ-స్కూటర్‌ల డెలివరీలను గత ఏడాది డిసెంబర్ 16న ప్రారంభించింది.  

మొదటి 100 స్కూటర్లు చెన్నై, బెంగళూరులోని వినియోగదారులకు డెలివరీ చేసింది. Ola ఎలక్ట్రిక్ స్కూటర్లు - S1 అండ్ S1 ప్రో ధర రూ. 99,999 అండ్ రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్ FAME II సబ్సిడీ అండ్ రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి).

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios