Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లోకి ఎం‌జి ఎంట్రీ.. నేడు లాంచ్ చేసిన రవాణా శాఖ మంత్రి..

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నేడు హైదరాబాద్ లో ఆటోమొబైల్ సంస్థ మోరిస్ గ్యారెజెస్ (ఎం‌జి) రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను  లాంచ్ చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజును, రోడ్‌ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు  చేసినట్లు పేర్కొన్నారు. 
 

morris garages enters in electric vehicle segment transport minister puvvada ajay kumar launched today
Author
Hyderabad, First Published Sep 9, 2021, 5:47 PM IST

హైదరాబాద్, 09.09.2021:  ప్రముఖ  ప్యాసెంజర్ వాహన శ్రేణి ఆటోమొబైల్ సంస్థ మోరిస్ గ్యారెజెస్ (ఎం‌జి) రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను గురువారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుందని, ఆ దిశగా అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ వాహన (ఈవీ) విధానానికి మంచి ఆదరణ లభిస్తుంది అని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఈవీల కొనుగోళ్లు క్రమంగా జోరందుకొంటున్నాయని, వివిధ ఆటోమొబైల్ సంస్థలు కూడా ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించే ప్రక్రియలో ఉన్నాయి అన్నారు.

తెలంగాణ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030లో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజును, రోడ్‌ ట్యాక్స్‌ను పూర్తిగా రద్దు చేయడం ఇందుకు ప్రధాన కారణమని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. 

also read బాలీవుడ్ హిరోల నుండి ప్రముఖ సెలెబ్రిటీల వరకు ఈ కారునే ఎందుకు కొంటున్నారో తెలుసా..?

ఇప్పటివరకు రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 4,568 ఈవీలు అమ్ముడయ్యాయని, వీటిలో 3,572 ద్విచక్రవాహనాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వీటన్నిటికి కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.19.93 కోట్ల పన్ను మినహాయింపు ఇచ్చినట్టు వెల్లడించారు. 

ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ గారు సూచనల మేరకు పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో అడుగుపెట్టిన ఎం‌జి సంస్థను, సిబ్బందికి మంత్రి పువ్వాడ అభినంధనలు తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios