బాలీవుడ్ హిరోల నుండి ప్రముఖ సెలెబ్రిటీల వరకు ఈ కారునే ఎందుకు కొంటున్నారో తెలుసా..?
లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ కారులోని ప్రత్యేకత ఏంటంటే దీని ఫీచర్స్ కారణంగా మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఏర్పడింది.
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నుండి రణవీర్ సింగ్ వరకు ప్రముఖ సెలెబ్రిటిలు మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600నే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది, మొత్తం మీద ఈ సంవత్సరం కేవలం 50 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు, బాలీవుడ్ సెలెబ్రిటిలలో ఇప్పటికే ఇద్దరూ ఈ ఎస్‌యూవి కారుని కొనుగోలు చేశారు. మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 లగ్జరీ ఫీచర్‌లు ఎంటో మీరే చూడండి...
మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 4మాటిక్ 6000-6500 ఆర్‌పిఎం రేటెడ్ అవుట్‌పుట్ వద్ద 410kW(557hp)తో 3982సిసి వి8 ఇంజిన్ అలాగే 2500-4500ఆర్‌పిఎం రేటెడ్ టార్క్ వద్ద 730ఎన్‌ఎం అందిస్తుంది. ఈ ఎస్‌యూవి కార్ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది అలాగే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీ.
ఈ ఎస్‌యూవిలోని పర్సనల్ బ్యాక్ సీట్లు ఫస్ట్-క్లాస్ ప్రైవేట్ జెట్ సీట్లను తలపిస్తుంది, వీటిని 43.5 డిగ్రీల వరకు మడత పెట్టవచ్చు ఇంకా 120ఎంఎం వరకు వెనక్కి నెట్టవచ్చు. ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ విత్ మెమరీ, ఎలక్ట్రికల్లీ ఎక్స్‌టెండింగ్ లెగ్ రెస్ట్, రియర్ కంఫర్ట్ ప్యాకేజీ ప్లస్ ఫీచర్లు, క్లైమైటైజ్డ్ ఔటర్ సీట్లు, మసాజ్ ఫంక్షన్‌తో మల్టీకాంటర్ సీట్లు దీనిలో ఇచ్చారు.
ఈ కారులోని విశాలమైన ఇంటీరియర్ హై క్లాస్ ని ప్రదర్శిస్తాయి. ఈ మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 4మాటిక్ కార్లు మార్కెట్లోకి రాక ముందే అన్నీ ప్రీ-బుక్ అయ్యాయి. త్వరలో రానున్న 'మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 4మాటిక్ కస్టమైజ్ వచ్చే యేడాది 2022 నాటికి కస్టమర్‌లకు డెలివరీ చేయనున్నారు.
రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్మెంట్ బ్యాక్ ఆర్మ్‌రెస్ట్‌లో చేర్చారు. అలాగే రెండు షాంపైన్ గ్లాసెస్, ఇంటీరియర్ లైటింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఈ ఎస్‌యూవిలో వైర్‌లెస్ ఛార్జింగ్, ఎంబియూఎక్స్ టాబ్లెట్ కూడా ఇచ్చారు.
మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 4మాటిక్ అనేది అల్ట్రా-లగ్జరీ 'మెర్సిడెస్-మేబాచ్' రేంజ్ బ్రాండ్ మొట్టమొదటి ఎస్‌యూవి. మేబాచ్ జిఎల్‌ఎస్ 600 4మాటిక్ ఎక్స్-షోరూమ్ ధర ఇండియాలో రూ. 2.43 కోట్లు.
మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 4మాటిక్ బ్యాక్ సీట్లలో మడత పెట్టగల టేబల్ ఉంది. వెనుక భాగంలో ఉన్న ఈ రెండు మడత పట్టగల టేబుల్స్ ఫస్ట్-క్లాస్ రియర్ సూట్ బిజినెస్ కన్సోల్‌ను సౌకర్యవంతమైన ప్రదేశంగా మారుస్తాయి. స్టోవేజ్ ట్రేలు నోట్‌బుక్ లేదా డాక్యుమెంట్‌ల కోసం స్థలాన్ని అందిస్తాయి. రెఫైన్ క్లైమెట్ కి సరిపోయేలా వాటిని హై-క్వాలిటీ లెథర్ తో ఫినిషింగ్ చేశారు.
స్టాండర్డ్ 55.9 సెం.మీ (22-అంగుళాలు) మేబాచ్ మల్టీ-స్పోక్ లైట్-అల్లాయ్ వీల్స్‌తో సహా పూర్తిగా ఇంటిగ్రేటెడ్ వీల్ బోల్ట్ కవర్‌లు ప్రత్యేకమైన డిజైన్ అందిస్తాయి.