న్యూఢిల్లీ: దేశీయంగా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ బుధవారం భారత మార్కెట్లోకి సరికొత్త మల్టీ పర్పస్‌ వెహికల్‌ ఎక్స్‌ఎల్ ‌6ను విడుదల చేసింది. దీని ధర రూ.9.79 లక్షల నుంచి రూ.11.46 లక్షలుగా నిర్ణయించారు. 5- స్పీడ్‌ మ్యానువల్‌ గేర్‌బాక్స్‌తోపాటు ఫోర్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. 

మ్యానువల్‌ వేరియంట్ల ధర వరుసగా రూ.9.79 లక్షలు - రూ.10.36 లక్షలు కాగా.. ఆటోమేటిక్‌ వెర్షన్‌ ధర రూ.10.89 లక్షలు - రూ. 11.46లక్షలుగా నిర్ణయించారు. ఇందులో మొత్తం ఆరు సీట్లు ఉండనున్నాయి. రెండో వరసలో ఉన్న కెప్టెన్‌ సీట్లు కారుకి ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతే కాదు మారుతి ఎక్స్ఎల్6 మోడల్ కారు నెక్సా బ్లూ, బ్రేవ్ ఖాకీ, ఔబర్న్ రెడ్, మాగ్మా గ్రే, ప్రీమియం సిల్వర్, ఆర్కిటిక్ వైట్ రంగుల్లో లభిస్తుంది. 

కంపెనీకి చెందిన నెక్సా ప్రీమియం రిటైల్‌ కేంద్రాలలో వీటిని విక్రయిస్తారు. కంపెనీ నుంచి వచ్చిన బీఎస్‌-6 మోడల్‌ వాహనాల్లో ఇది ఏడోది కావడం విశేషం. మొత్తం ఆరు రంగుల్లో ఈ కారు వినియోగదారుల్ని ఆకట్టుకోనున్నది. డ్యాష్‌బోర్డులో 7.0 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థ ఉంది. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేకు సపోర్టివ్‌గా ఉంటుంది.  

ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, క్రూజ్‌ కంట్రోల్‌, సెకండ్‌ రో ఏసీ వెంట్స్‌, ఆటోమేటిక్‌ హెడ్‌ ల్యాంప్స్‌, వైపర్స్‌, డ్యుయల్‌ ఫ్రంట్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, పార్కింగ్‌ సెన్సార్లు, స్పీడ్‌ వార్నింగ్‌ వ్యవస్థ ఎక్స్‌ఎల్‌6లో ఉన్న తదితర వసతులు. 1.5 లీటర్ల కె15 పెట్రోల్‌ ఇంజిన్‌కు ఎస్‌హెచ్‌వీఎస్‌ (స్మార్ట్‌ హైబ్రీడ్‌ వెహికల్‌ బై సుజుకీ) కలిగి ఉన్న ఈ కారు 103హెచ్‌పీ శక్తితోపాటు 138ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

డిజైన్ పరంగా ఎక్స్ఎల్6 మోడల్ కారు ఎర్టిగాను పోలి ఉంటుంది. రీ స్టైల్డ్ ఫ్రంట్ ఎండ్ స్పోర్టింగ్ లార్జర్ గ్రిల్లె, న్యూ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, చంకియర్ బంపర్, ఫౌక్స్ స్కిడ్ ప్లేట్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్ అండ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రెయిల్స్, ప్లాస్టిక్ సైడ్ బాడీ క్లాడింగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

అల్ఫా అదనంగా ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, స్టాండర్డ్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్, ఏబీఎస్, ఈబీడీ, రేర్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ వార్నింగ్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కారు నెక్సా చైన్ డీలర్ల వద్ద లభిస్తుంది. ఇది మహీంద్రా మర్రాజో, హోండా బీఆర్-వీ, హ్యుండాయ్ క్రెట్టా, అప్ డేటెడ్ రెనాల్ట్ డస్టర్ కార్లతో ఢీ కొడుతుంది.