Maruti Suzuki Price Hike: ఆ కార్ల ధరలు పెంపు- అదే బాటలో మరిన్ని..!

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) పలు మోడళ్ల ధరలను 4.3 శాతం వరకు పెంచినట్లు శనివారం తెలిపింది. పెరిగిన ధరలు శ‌నివారం నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. 

Maruti Suzuki Price Hike

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) పలు మోడళ్ల ధరలను 4.3 శాతం వరకు పెంచినట్లు శనివారం తెలిపింది. పెరిగిన ధరలు శ‌నివారం నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఇన్‌పుట్‌ల ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అనేక ఇన్‌పుట్‌ల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ తన మోడళ్ల ధరలను 0.1 శాతం నుండి 4.3 శాతం వరకు పెంచింది.

ఢిల్లీలో సగటు ధరల పెరుగుదల ఎక్స్-షోరూమ్ ధరల కంటే 1.7 శాతంగా ఉందని ఆటో కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కొత్త ధరలు శ‌నివారం నుంచి వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి ఇండియా ఆల్టో నుండి ఎస్-క్రాస్ వరకు కార్ల శ్రేణిని విక్రయిస్తోంది. వాటి ధరలు వరుసగా రూ. 3.15 లక్షల నుండి రూ. 12.56 లక్షల మధ్య ఉన్నాయి. పెద్ద ఆటో రంగ సంస్థ గతంలో వాహనాల ధరలను గత ఏడాది మూడుసార్లు పెంచింది. గత ఏడాది నుంచి మారుతీ సుజుకీ వరుసగా ధరలు పెంచుతూ వస్తోంది. ధరలు పెంచిన ప్రతిసారి ముడి పదార్థాల వ్యయాలు పెరగటమే కారణంగా వెల్లడిచింది. 2021లో మొత్తం మూడు సార్లు ధరలను పెంచింది మారుతీ సుజుకీ.

2021 జనవరిలో 1.4 శాతం, 2021 ఏప్రిల్​లో 1.6 శాతం, 2021 సెప్టెంబర్​లో 1.9 శాతం చొప్పున ధరలు పెరిగాయి.దీంతో మొత్తం పెరుగుదల 4.9 శాతానికి చేరుకుంది.  ముడి పదార్థాల ధరలు పెరిగిన కారణంగా.. కార్ల తయారీ వ్యయాలు పెరిగినట్లు మారుతీ పేర్కొంది. ఇందుకోసమే పెరిగిన భారంలో కొంత వినియోగదారులపై మోపక తప్పడం (Maruti Suzuki on Cars price hike) లేదని వెల్లడించింది. గత ఏడాది కాలంలో స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల ధరలు పెరిగాయని తెలిపింది. మారుతీ సుజుకీ బాటలోనే మరిన్ని సంస్థలు కూడా కార్ల ధరలు పెంచే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా అన్ని సంస్థలు ముడి సరుకు వ్యయాల కారణంతో తమ కార్ల ధరలు పెంచిన విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios