Asianet News TeluguAsianet News Telugu

మారుతి సుజుకి 40వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త లిమిటెడ్ ఎడిషన్‌.. ఇప్పుడు స్టయిల్ కి తగ్గట్టుగా..

ఈ ఐదు Nexa మోడల్‌లు ప్రీమియం మెటాలిక్ బ్లాక్ కలర్‌లో వస్తున్నాయి. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్లాక్ ఎడిషన్ ప్రతి మారుతి సుజుకి మోడల్‌లోని సెలెక్ట్ చేసిన వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

Maruti Suzuki launches Nexa Black Edition on 40th anniversary know features
Author
First Published Jan 7, 2023, 6:46 PM IST

ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి భారత కార్ మార్కెట్లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెక్సా మోడల్స్  పై స్పెషల్ బ్లాక్ ఎడిషన్‌ను లాంచ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. కొత్త స్పెషల్ బ్లాక్ ఎడిషన్ లో మొత్తం 5 నెక్సా కార్లు ఉన్నాయి - ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఎక్స్‌ఎల్6 తాజాగా లాంచ్ చేసిన గ్రాండ్ విటారా.

ఇంకా ఏమిటంటే
ఈ ఐదు Nexa మోడల్‌లు ప్రీమియం మెటాలిక్ బ్లాక్ కలర్‌లో వస్తున్నాయి. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్లాక్ ఎడిషన్ ప్రతి మారుతి సుజుకి మోడల్‌లోని సెలెక్ట్ చేసిన వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, Nexa బ్లాక్ ఎడిషన్ ఇగ్నిస్ Zeta, ఆల్ఫా వేరియంట్‌లలో ఉంది. Ciaz అన్నీ వేరియంట్‌లు, ఎక్స్‌ఎల్6 Alpha ఇంకా Alpha+ వేరియంట్‌లు అండ్ గ్రాండ్ విటారా Zeta, Zeta+, Alpha అలాగే Alpha+ వేరియంట్‌లు ఉన్నాయి. స్పెషల్ ఎడిషన్ మోడల్ ధరలు నెక్సా కార్ల స్టాండర్డ్ రేంజ్ అనుగుణంగా ఉంటాయి.

లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీ
కొత్త బ్లాక్ ఎడిషన్‌తో పాటు NEXA కస్టమర్లకు కార్లను మరింత కస్టమైజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ గా లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని కూడా పరిచయం చేసింది. అన్ని Nexa కార్లకు ప్రత్యేక తగ్గింపు ధరలలో లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలు ఉన్నాయి.

లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీలో ఫ్రంట్ అండ్ రియర్ అండర్‌బాడీ స్పాయిలర్, ఫ్రంట్ ఫెండర్ గార్నిష్, బ్యాక్ డోర్ గార్నిష్, లోగో లైట్లు, ORVM గార్నిష్, హెడ్ ల్యాంప్ గార్నిష్, గ్రే అండ్ బ్లాక్ షేడ్‌ ఎక్స్ట్రా ఖర్చు తో ఐటెమ్‌లు ఉన్నాయి. 

కంపెనీ అంచనాలు 
నెక్సా బ్లాక్ ఎడిషన్ అండ్ లిమిటెడ్ ఎడిషన్ యాక్సెసరీ ప్యాకేజీని పరిచయం చేస్తూ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, “మేము మారుతి సుజుకి 40వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున బ్లాక్ ఎడిషన్‌తో ఉత్సాహంగా ఉన్నాము. NEXA 7-సంవత్సరాల వార్షికోత్సవాన్ని పరిచయం చేయడానికి ఇంకా జరుపుకోవడానికి ఉత్సాహంగా ఉంది. NEXA బ్లాక్ ఎడిషన్ వాహనాలు NEXA నుండి మా కస్టమర్‌లు ఆశించే పూర్తి అధునాతనత ఇంకా ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా, కస్టమర్‌లు వారి స్టయిల్ కి మ్యాచ్ అయ్యేలా అనేక రకాల ప్రాడెక్ట్స్ నుండి ఎంచుకోవచ్చు. లిమిటెడ్ ఎడిషన్ అనుబంధ ప్యాకేజీతో మీకు ఇష్టమైన NEXA కార్ ని పర్సనలైజ్ చేసుకోవచ్చు. ఇండియన్ రోడ్లపై NEXA బ్లాక్ ఎడిషన్ కార్లను చూడటానికి మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios