Asianet News TeluguAsianet News Telugu

మాన్ సూన్ సర్వీస్ క్యాంప్ ను ప్రకటించిన మారుతి సుజుకి

మారుతి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం మాన్ సూన్ సర్విస్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీని ద్వారా తమ సంస్థకు చెందిన వాహనాల కండీషన్ ను ఉచితంగా తనిఖీ చేయనున్నారు. ఈ ఆఫర్ జూలై 9 వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు దేశంలోని ప్రతి మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ లో లభించనుంది. 

Maruti Suzuki Announces Monsoon Service Camp

మారుతి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం మాన్ సూన్ సర్విస్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీని ద్వారా తమ సంస్థకు చెందిన వాహనాల కండీషన్ ను ఉచితంగా తనిఖీ చేయనున్నారు. ఈ ఆఫర్ జూలై 9 వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు దేశంలోని ప్రతి మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ లో లభించనుంది. 

ఈ వానాకాలంలో వినియోగదారుల వాహనాలను మంచి కండీషన్ లో ఉంచడానికే ఈ  క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. తమ సంస్థకు చెందిన వాహనాలు ఈ వర్షాల వల్ల వినియోగదారులకు ఇబ్బంది పెట్టకుండా చూడాలనే లక్ష్యంతో ఈ సర్వీస్ క్యాంప్ నిర్వవహిస్తున్నట్లు తెలిపారు.

సురక్షితంగా మరియు అవాంతరం లేని డ్రైవింగ్ కోసం ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు మారుతి సంస్థ వెల్లడించింది. అందుకోసం ఈ క్యాంప్ కి వచ్చే వాహనాలను శిక్షణ పొందిన మరియు బాగా అర్హత గల నిపుణులచే తనిఖీ చేయిస్తామని తెలిపింది. తనిఖీ తర్వాత ఏవైనా ప్రాబ్లమ్స్ బైటపడితే అక్కడికక్కడే రిపేర్ చేయిస్తామని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇబ్బందులు పెట్టే బ్రేక్స్, విండ్ స్క్రీన్స్, వైపర్ బ్లేడ్స్, బ్యాటరీ తదితర పార్ట్స్ తనిఖీతో పాటు కొన్ని అవసరమైన ఉపకరణాలను డిస్కౌంట్ ధరలకు అందించనున్నారు. ఈ ఆఫర్ కేవలం వర్షాకాలానికి మాత్రమే పరిమితమని తెలిపారు. ఈ తనిఖీల వల్ల వాహనాల పనితీరును మెరుగుపడి వర్షాకాలంలో వినియోగదారులకు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. 
 
ఈ సర్వీస్ క్యాంపుపై మారుతి సుుజుకి ఇండియా ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ... ఈ వర్షాకాలంలో వాహనాలు బ్రేక్ డౌన్ కాకుండా మంచి కండీషన్ లో ఉంచడానికే ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ముందుచూపుతోనే ఈ క్యాంపు ఏర్పాటు చేసినట్లు బెనర్జీ తెలిపారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios