Asianet News TeluguAsianet News Telugu

మారుతి ఎకో వ్యాన్‌.. ఐదు లక్షల లోపు ధర, ఏడు సీట్లు ఇంకా గొప్ప మైలేజ్.. ఇంతగా పాపులర్ అవడానికి ఫీచర్స్ ఇవే..

మారుతి సుజుకి ఎకో వ్యాన్ ఐదు సీటర్లు, ఏడు సీటర్లు, కార్గో, టూర్ ఇంకా అంబులెన్స్ వంటి 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎకో వ్యాన్‌ను రూపొందించినట్లు MSIL పేర్కొంది.

maruti eeco van Price under five lakhs, seven seats and great mileage; Here are  secrets of becoming an eco star-sak
Author
First Published Feb 27, 2023, 4:41 PM IST

మారుతి సుజుకి ఏడు సీట్ల వాన్ ఎకో దేశంలో 1 మిలియన్ యూనిట్ల సేల్స్ ద్వారా కొత్త రికార్డును సృష్టించింది. మారుతి ఎకో 2010లో ప్రారంభించినప్పటి నుండి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వ్యాన్. ఈ వ్యాన్‌ని ఇంతగా పాపులర్ చేయడానికి వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది...

మారుతి సుజుకి ఎకో వ్యాన్ ఐదు సీటర్లు, ఏడు సీటర్లు, కార్గో, టూర్ ఇంకా అంబులెన్స్ వంటి 13 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎకో వ్యాన్‌ను రూపొందించినట్లు MSIL పేర్కొంది. కంపెనీ అప్ డెటెడ్ ఎకో వ్యాన్‌ను నవంబర్ 2022లో దేశంలో ప్రారంభించింది. కొత్త మోడల్‌లో కొత్త ఇంజన్, మెరుగైన ఇంటీరియర్స్ ఇంకా మెరుగైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మారుతి సుజుకి ఎకో 1.2 L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో 6,000 rpm వద్ద 80.76 PS శక్తిని, 3,000 rpm వద్ద 104.4 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త పవర్‌ట్రెయిన్ పాత మోడల్ కంటే 10% ఎక్కువ శక్తిని అందిస్తుంది. CNG వెర్షన్ గురించి చెప్పాలంటే,  6000 rpm వద్ద 71.65 PS శక్తిని, 3,000 rpm వద్ద 95 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. టూర్ వేరియంట్ పెట్రోల్‌ పై 20.20kmpl, CNG వెర్షన్‌  27.05km/kg ARAI సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. ప్యాసింజర్ వెర్షన్ పెట్రోల్ పై 19.71kmpl, CNG వెర్షన్ 26.78km/kg మైలేజీని అందిస్తుంది.

ఈ వాహనం  కొలతలు గురించి మాట్లాడినట్లయితే 3675ఎం‌ఎం పొడవు, 1475ఎం‌ఎం వెడల్పు, 1825ఎం‌ఎం ఎత్తును ఉంటుంది. దీని వీల్ బేస్ 2350 ఎం‌ఎం. బరువు 940 కిలోలు. భద్రత కోసం, చైల్డ్ సేఫ్టీ లాక్, డిస్క్ బ్రేక్ సౌకర్యాన్ని పొందుతుంది. ఇంకా ఇప్పుడు ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ + EBD, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారులో ఖాళీ స్థలం చాలా ఉంటుంది ఇంకా ఆరు లేదా ఏడుగురు సులభంగా ఇందులో కూర్చోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు 5 లేదా అంతకంటే తక్కువ మందితో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మంచి స్థలం ఇందులో ఉంటుంది.

దీనిలో రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్లు, క్యాబిన్ ఎయిర్-ఫిల్టర్ (AC వేరియంట్), డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, AC అండ్ హీటర్ కోసం రోటరీ కంట్రోల్ తో వస్తుంది. భద్రతా ఫీచర్స్ లో ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, స్లైడింగ్ డోర్లు,  కిటికీల కోసం చైల్డ్ లాక్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ వ్యాన్ సాలిడ్ వైట్, మెటాలిక్ సిల్కీ సిల్వర్, పెర్ల్ మిడ్‌నైట్ బ్లాక్, మెటాలిక్ గ్లిస్టెనింగ్ గ్రే ఇంకా న్యూ మెటాలిక్ బ్రిస్క్ బ్లూ అనే ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios