ముంబై: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఇంజిన్ గల తొలి కారును అందుబాటులోకి తెచ్చింది. సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘ఎక్స్‌యూవీ300’ను ఆవిష్కరించింది. ఇందులో 1.2 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్ ఇంజిన్ అమర్చారు.

also read మెర్సిడెస్‌ బెంజ్ సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు...ఓన్లీ రూ.52.56 లక్షలు

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కారు ధర రూ.8.30 లక్షల వద్ద ప్రారంభమై రూ.11.84 లక్షల మధ్య ఉంటుంది. బీఎస్ -4 మోడల్ ధరతో పోలిస్తే రూ.20 వేలు అధికం.దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ విభాగం అధ్యక్షుడు రాజన్ వధేరా మాట్లాడుతూ ‘మేం మా తొలి బీఎస్-6 కారును విడుదల చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది మా బీఎస్-6 ప్రయాణంలో ఒక కీలక మైలురాయి’ అని తెలిపారు. 

‘కఠినమైన నిబంధనలను సంత్రుప్తి పరిచేందుకు తక్కువ సమయం, ఒత్తిడి ఉన్నా.. మేం మా పంపిణీ దారులతో కలిసి పని చేసి విజయవంతం అయ్యాం. మా వాహనాలన్నీ కొత్త టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేస్తాం’ అని రాజన్ వధేరా పేర్కొన్నారు.

also read జాగ్వార్ నుండి కొత్త మోడల్ కార్...మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే ?

ఇప్పటి వరకు మహీంద్రా డీజిల్ పోర్టుఫోలియో వాహనాలను మాత్రం బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్చలేదు. నిబంధనలు అమలులోకి రాకముందే తాము బీఎస్-6 ఇంజిన్ల వాహనాలను సిద్ధం చేస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ప్రస్తుతానికి పెట్రోల్ వర్షన్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది.