జాగ్వార్ నుండి కొత్త మోడల్ కార్...మార్కెట్లోకి విడుదల ఎప్పుడంటే ?
జాగ్వార్ XE ఫేస్ లిఫ్ట్ S మరియు SE అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ ఎండ్ ఎస్‌ఇ మోడల్ పెట్రోల్ వేరిఎంట్ రూ.46.32 లక్షలు మరియు బేస్ ఎస్ మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు రూ. 44.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఈ ధరలు ఎక్స్- షోరూమ్, ఇండియా).
భారతదేశంలో జాగ్వార్ కార్ల కంపనీ తమ కొత్త మోడల్ జాగ్వార్ ఎక్స్‌ఇ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. జాగ్వార్ XE ఫేస్ లిఫ్ట్ S మరియు SE అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. టాప్ ఎండ్ ఎస్‌ఇ మోడల్ పెట్రోల్ వేరిఎంట్ రూ.46.32 లక్షలు మరియు బేస్ ఎస్ మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌లకు రూ. 44.98 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఈ ధరలు ఎక్స్- షోరూమ్, ఇండియా).
also read మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ఎస్‌యూవీ మోడల్ కారు...ఓన్లీ రూ.52.56 లక్షలు
XE కి చాలా అప్ డేట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది యూరోపియన్ మార్కెట్లో ప్రవేశపెట్టిన 10 నెలల తరువాత ఇండియన్ మార్కెట్లోకి వస్తుంది. XE ఫేస్‌లిఫ్ట్ కొన్ని చిన్న మార్పులను పొందుతుంది. అయితే ఇది స్పోర్టి లుక్ కోసం కొంచెం వెడల్పుగా ఉంటుంది.
జాగ్వార్ ఎక్స్‌ఇ 2020 ఫేస్‌లిఫ్ట్ మోడల్ ముందు భాగంలో పెద్ద మెష్ గ్రిల్‌ను ఉంటుంది. 12 ఎంఎం స్లిమ్మర్ హెడ్‌ల్యాంప్‌లు అలాగే కొత్త జె-బ్లేడ్ ఎల్‌ఇడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో వస్తుంది. కారు ఖచ్చితంగా ప్రస్తుత వెర్షన్ కంటే చాలా అందంగా కనిపిస్తుంది.
కారు లోపలి భాగంలో చాలా విస్తృతమైన అప్ డేట్స్ ఉన్నాయి. జాగ్వార్ ఎక్స్‌ఇ ఫేస్‌లిఫ్ట్ సెంటర్ కన్సోల్ కోసం కొత్త డ్యూయల్ టచ్‌స్క్రీన్ ను అమర్చారు. టచ్ ప్రో డ్యో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ క్యాబిన్ ,10.2-అంగుళాల టాప్ స్క్రీన్ అన్నీ రకాల కనెక్టివిటీ చేస్కోడానికి, నావిగేషన్ కూడా అనుమతిస్తుంది. సెకండ్ స్క్రీన్ లో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కోసం పుల్-పుష్ బటన్స్ ఉంటాయి.
క్యాబిన్ ఎఫ్-టైప్, ఇ-పేస్ నుండి పిస్టల్ గ్రిప్ గేర్ సెలెక్టర్ తో వస్తుంది, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఐ-పేస్ బటన్లతో వస్తుంది. ఇంకా ఇందులో లెదర్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, హిల్ అసిస్ట్, లేన్-కీప్ అసిస్ట్ ఇంకా వివిధ రకాల ఫీచర్స్ ఉన్నాయి.
also read మారుతి ‘ధరల’ బాంబు: వచ్చే ఏడాది నుంచి కార్లు మరింత భారం
జాగ్వార్ ఎక్స్‌ఇ 2020 ఫేస్‌లిఫ్ట్‌లోని పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు రాబోయే బిఎస్ 6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్, 5,500rpm, 247 bhp, 1500 - 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 365 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇంజన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది.