Mahindra Cars Big Offer: మ‌హీంద్రా కార్ల‌పై అదిరిపోయే ఆఫ‌ర్లు.. భారీగా త‌గ్గింపు..!

మ‌హీంద్రా త‌న కార్ల‌పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. వీటిలో ఎక్స్ యూవీ 300,  ఆల్ట్రాస్‌ పై క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు అందుబాటులో ఉండ‌గా, దీంతోపాటు KUV 100 NXT, స్కార్పియోల‌పై కూడా మంచి ఆఫ‌ర్లే ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు కంపెనీ అధికారిక వెబ్ సైట్‌లో లిస్ట్ అయ్యాయి.
 

Mahindra Cars Big Offer

ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఇది మంచి అవకాశం. హోళీ సందర్భంగా పలు కార్లపై మహీంద్రా భారీ తగ్గింపును అందిస్తోంది. మహీంద్రా ఆయా మోడల్స్‌పై ఏకంగా రూ.3.02 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది.

మహీంద్రా అందిస్తోన్న ఆఫర్స్‌ ఇవే..!

మహీంద్రా స్కార్పియో: మహీంద్రా స్కార్పియో కారు కొనుగోలుపై ఎటువంటి నగదు తగ్గింపును అందించడం లేదు. అయితే కొనుగోలుదారులు రూ. 15,000 పైగా విలువైన యాక్సెసరీలను ఉచితంగా  పొందవచ్చు. ఈ  కారు కొనుగోలుపై కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 15,000 కూడా అందుబాటులో ఉన్నాయి. 

మహీంద్రా KUV100 NXT: మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ KUV100 NXTపై రూ. 38,055 వరకు నగదు తగ్గింపును, రూ. 3,000 వరకు కార్పొరేట్ తగ్గింపు, ఎక్సేఛేంజ్‌ ఆఫర్ కింద రూ. 20,000 వరకు కొనుగోలుదారులకు లభించనుంది.  

మహీంద్రా XUV300: మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కాంపాక్ట్‌ ఎస్‌యూవీ రూ.30వేల డిస్కౌంట్‌ పొందవచ్చు. ఎక్ఛేంజ్‌ బోనస్‌ రూ.25వేలు, కార్పొరేట్‌ రూ.4వేలు తగ్గింపు, ఇతర ఆఫర్లు రూ.10 వేల వరకు పొందవచ్చు.

మహీంద్రా ఆల్ట్రాస్‌: మహీంద్రా Alturas G4 కారు కొనుగోలుపై  ఏకంగా రూ. 2.2 లక్షల భారీ తగ్గింపును అందిస్తోంది .దాంతో పాటుగా రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 11,500 అదనపు కార్పొరేట్ తగ్గింపును మహీంద్రా కల్పిస్తోంది.అంతేకాకుండా ఈ కారు కొనుగోలుపై రూ. 20,000 విలువైన యాక్సెసరీలను ఉచితంగా పొందవచ్చును. 

మహీంద్రా మరాజో: మరాజో మూడు వేరియంట్లలో కూడా ఆఫర్లను ప్రకటించింది. M2, M4 ప్లస్‌, M6 ప్లస్‌ వేరియంట్లపై రూ.20వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఎస్‌యూవీ బేస్ M2 ట్రిమ్‌పై రూ. 20,000 వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, ఇతర ట్రిమ్‌ వేరియంట్స్‌పై రూ. 15,000 క్యాష్‌ డిస్కౌంట్‌ లభించనుంది. వీటితో పాటుగా రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్‌ రూ. 5,200 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios