కొత్త వసంతంలో కొత్త కార్లు...నాలుగు నెలల్లో 40వేల అమ్మకాలు

అనంత పురం జిల్లాలో 22 నెలల్లో నిర్మాణం పూర్తిచేసుకున్న దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘కియా మోటార్స్’ మూడు నెలల్లోనే రెండో షిప్టు ఉత్పత్తి ప్రారంభించింది. కేవలం నాలుగు నెలల్లో 40 వేల కార్ల విక్రయించింది. అనంతపురం ఉత్పత్తి యూనిట్ నుంచే దేశమంతటా పంపిణీ చేస్తోంది. త్వరలోనే మూడో షిఫ్టులో ఉత్పత్తి ప్రారంభించనున్నది.  మల్టీ పర్పస్ వెహికల్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)లకు ప్రాధాన్యం ఇస్తోంది.

Kia Motors aiming at 300 touchpoints by end of fiscal

అనంతపుర: అనంతపురంలో కియా మోటార్స్ కార్ల ఉత్పత్తి ప్లాంటు కోసం 1.1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అందుకు తగినట్లే తయారైన తొలి కారు సెల్టోస్‌.. విక్రయాలు ప్రారంభించిన మొదటిరోజే 6,064 కార్లను విక్రయించి రికార్డు సృష్టించింది. తొలి నాలుగు నెలల్లో 40,649 కార్లను అమ్మింది.

ఉత్పాదక ప్లాంట్, అనుబంధ విభాగాల్లో కలిపి 12 వేల మందికి కియా మోటార్స్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 70 వేల కార్లు. దీన్ని త్వరలోనే ఏడాదికి మూడు లక్షల ఉత్పత్తి స్థాయికి చేరుకునేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రెండు షిఫ్టుల్లో ఉత్పత్తి చేస్తున్న ఈ ప్లాంటు.. రాబోయే రోజుల్లో మూడో షిఫ్టు ఉత్పత్తినీ ప్రారంభించనుంది.

also read  8 సెకన్లలో 100 కి.మీ వేగం...ఎంజీ మోటార్స్‌ ‘జెడ్‌ఎస్‌’ స్పెషాలిటీ
 
కియాకు ప్రపంచవ్యాప్తంగా 14 కార్ల తయారీ ప్లాంట్లు ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది 15వది. అనంతపురం జిల్లా ఎర్రమంచి వద్ద నిర్మించిన ఈ ఉత్పాదక యూనిట్ అత్యంత అధునాతనమైనది. కియా ఇతర ప్లాంట్ల కంటే ఆధునికం. ఇక మల్టీ పర్పస్ వెహికల్స్, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో మల్టీ పర్పస్ వెహికిల్స్ ఆవిష్కరణకు సిద్ధమవుతున్నది. 

Kia Motors aiming at 300 touchpoints by end of fiscal

కాలుష్య ఉద్గారాలు జీరో స్థాయిలో ఉండేలా అనంతపురం కియా మోటార్స్ ప్లాంట్ రూపుదిద్దుకున్నది. ఈ ప్లాంటులో ఉన్న 450 రోబోలు.. బాడీ షాప్‌, పెయింట్‌, అసెంబ్లింగ్‌ సెక్షన్లలో తమ పని తాము చేసుకుంటూ వెళ్తాయి. మరోవైపు.. నైపుణ్యాలతో సంబంధం లేని ఉద్యోగాలన్నీ స్థానికులకే కియా కల్పిస్తుంది. 

also read విపణిలోకి మహీంద్రా తొలి బీఎస్-6 ‘ఎక్స్‌యూవీ 300’

నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలను ప్రస్తుతానికి బయటివారికి ఇచ్చినా.. ఇక్కడే నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేసి స్థానికులకు శిక్షణ ఇస్తోంది. మున్ముందుకు నైపుణ్యాలు ఉన్న ఉద్యోగాలు కూడా స్థానికులకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

కియా మోటార్స్‌కు పలు అనుబంధ యూనిట్లు కూడా వచ్చాయి. కియా మోటార్స్ ఉత్పాదక ప్లాంట్ ఏర్పాటుతో అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై భూముల విలువలు పెరిగాయి. ఒకప్పుడు జాతీయ రహదారికి అటూ ఇటూ ఖాళీ బీడు భూములు మాత్రమే దర్శనమిచ్చేవి. గత కొన్నేళ్లలో వచ్చిన యూనిట్ల ఫలితంగా ఇప్పుడు పలుచోట్ల నిర్మాణాలు, ప్లాంట్లు పూర్తి కావస్తున్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios