న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ క్లాసిక్ లెజెండ్స్ జావా సంస్థ ‘పెరక్ బాబర్’ మోడల్ పేరిట సరికొత్త మోటారు సైకిల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. జావా నుంచి విపణిలోకి ప్రవేశిస్తున్న తొలి కస్టమ్ స్టయిల్ మోడల్ వెహికల్ ఇదే కావడం గమనార్హం. 

దీంతోపాటు జావా, జావా 42 మోటారు బైక్ లను కూడా ఆవిష్కరించింది క్లాసిక్ లెజెండ్. గతేడాదే జావా బైక్‌ల ఆవిష్కరణ సందర్భంగా ఈ బైక్ కూడా ప్రదర్శనలో ఉంచారు. కానీ ఇప్పటి వరకు విక్రయాలు ప్రారంభం కాలేదు. జావా పెరక్ బాబార్ బైక్ ధర రూ.1.94 లక్షలుగా మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయించింది. 

also read MG మోటర్స్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్...త్వరలో

బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న జావా పెరక్ బాబర్ బైక్ 334 సీసీ లిక్విడ్ కూల్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 30 బీహెచ్పీ శక్తిని కలిగి ఉండటంతోపాటు 31 ఎన్ఎం టార్చిని ఉత్పత్తి చేస్తుంది. 

పెరక్ బాబర్ మోటారు సైకిలులో లాంగర్ స్వింగ్ ఆర్మ్, మోనోషాక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ ఫీచర్లు లభిస్తున్నాయి. పెరక్ బాబర్ మోటారు సైకిలులో వెడల్పాటి హ్యాండిల్ బార్, తక్కువ ఎత్తులో ఉండే సీట్, ఆకర్షణీయవంతమైన ఫ్యూయల్ ట్యాంక్, బుల్లెట్ షెల్ ను పోలి ఉండే హెడ్ ల్యాంప్, స్పోక్ వీల్స్ ఈ మోటారు సైకిలులో అదనపు ఆకర్షణలు కానున్నాయి. 

also read ఫెరారీ నుండి సరికొత్త రోమా గ్రాండ్ టూరర్ (జిటి)...

దీనికి అవసరాల మేరకు వెనుక సీటు అమర్చుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి నుంచి కొనుగోలు దారుల నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తారు. ఏప్రిల్ నుంచి కస్టమర్లకు బైక్‌లను డెలివరీ చేయనున్నది మహీంద్రా అండ్ మహీంద్రా. 6- స్పీడ్ గేర్ బాక్స్ కల మిగతా రెండడు బైక్‌లన్నింటిలో 293 సీసీ ఇంజిన్, 27 బీహెచ్పీతో కూడిన 28 ఎన్ఎం టార్చిని అందిస్తుంది. 1950లో జావా సంస్థ విక్రయించిన మోటారు బైక్‌ను పోలి ఉంటుంది పెరక్.

జాబా బాబర్ పెరక్ బ్యూటిపుల్ లుకింగ్ మోటార్ సైకిల్ కావడంతోపాటు  డ్యుయల్ చానెల్ ఏబీఎస్ కల ఈ బైక్ 334 సీసీ ఇంజిన్‌తోపాటు 30 బీహెచ్పీ శక్తిని, 31 ఎన్ఎం టార్చ్‌ను అందిస్తుంది. ఇది 6- స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది.