Asianet News TeluguAsianet News Telugu

MG మోటర్స్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్...త్వరలో

MG మోటర్స్ ఇండియా ZS ఎలక్ట్రిక్ కార్ ను దేశంలోని 5 నగరాల్లో మాత్రమే ప్రారంభించాలనుకుంటున్నారు. వీటిలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు మరియు హైదరాబాద్ ఉన్నాయి.ఈ ఎలక్ట్రిక్ వాహనం కోసం బుకింగ్‌లు డిసెంబర్ 5 నుండే ప్రారంభమవుతాయి. కారును 2020 జనవరిలో విడుదలకు షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు.

mg motors set to launch its ev car soon
Author
Hyderabad, First Published Nov 16, 2019, 12:07 PM IST

ఎంజి మోటార్ ఇండియా తన రెండవ ఉత్పత్తిని భారత మార్కెట్ లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. MG మోటర్స్ చాలా కాలంగా ZS ఎలక్ట్రిక్ వెహికల్ ( EV ) గురించి వివరాలను వెల్లడించలేదు. ఈ సంస్థ దేశంలో ఇప్పుడు తమ EV కారు వివరాలను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం కోసం బుకింగ్‌లు డిసెంబర్ 5 నుండే ప్రారంభమవుతాయి.

కారును 2020 జనవరిలో విడుదలకు షెడ్యూల్ చేయాలని నిర్ణయించారు. ఎంజి మోటార్ ఇండియా జెడ్‌ఎస్ ఇవిని దేశంలోని 5 నగరాల్లో మాత్రమే ప్రారంభించనుంది.వీటిలో ఢిల్లీ , ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు మరియు హైదరాబాద్ ఉన్నాయి.

mg motors set to launch its ev car soon

also read ఫెరారీ నుండి సరికొత్త రోమా గ్రాండ్ టూరర్ (జిటి)...

కారు యొక్క వివరాలు, ఫీచర్స్ యు.కె లో విక్రయించిన కారు మాదిరిగానే ఉంటాయి. కాబట్టి, కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు సింక్రోనస్ మోటారుతో శక్తినిస్తుంది ఇది 141 బిహెచ్‌పి, 353 nm పీక్ టార్క్‌ను ఇస్తుంది. ఈ మోడల్ కారుకి 44.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జీ చేస్తే 300 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

50 కిలోవాట్ల డిసి ఛార్జర్‌తో లిథియం-అయాన్ బ్యాటరీ యూనిట్‌ ను 40 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు అలాగే  స్టాండర్డ్ 7 కిలోవాట్ల ఛార్జర్‌తో అయితే ఏడు గంటల వరకు సమయం పడుతుంది .హ్యుందాయ్ కోనా (ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించబడినది) తో పోలిస్తే ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ అలాగే ఇది ఖచ్చితంగా ఒక మంచి ప్రయోజనం, కానీ MG ZS EV అందించే మైలేజ్ కూడా పరిగణించవలసిన విషయం.

mg motors set to launch its ev car soon

సంస్థ ఇప్పటివరకు అధికారిక మైలేజ్ ప్రకటించలేదు కానీ ఒకే ఛార్జీలో 400 కి.మీ కంటే ఎక్కువ వరకు మైలేజ్ ఇవ్వొచు అని మాట్లాడుతున్నారు. దీనిపై పూర్తి అధికారిక సమాచారం డిసెంబర్ 5, 2019 న వెల్లడించనున్నారు. ఇక MG ZS EV కారు కొలతలు  4314 mm పొడవు, 1809mm వెడల్పు ఉండగా 1620mm ఎత్తు ఉంటుంది. విల్స్ మధ్య స్థలం 2579 mm.

also read  దూసుకొస్తున్న డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4.. వచ్చే ఏడాది విపణిలోకి..

MG ZS EV  లోపల 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్డ్ స్టీరింగ్ వీల్, ముందు ఇంకా వెనుక భాగంలో యుఎస్‌బి మొబైల్ ఛార్జింగ్ ఫంక్షన్, బ్లూటూత్ మరియు రియర్ వ్యూ పార్కింగ్ కెమెరాతో పాటు వస్తుంది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఆఫర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటుంది.

mg motors set to launch its ev car soon

MG ZS EV ముందు భాగం డిజైన్  స్మార్ట్, డీసెంట్ గా కనిపిస్తుంది. బోల్డ్ డైమండ్ ఫినిష్డ్ గ్రిల్, బోనెట్, కర్వేడ్ రూఫ్ కలిగి ఉంటుంది. EV కారు అమ్మకాలకు మద్దతుగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను సృష్టించే ప్రయత్నంలో MG మోటార్ ఇండియా వివిధ నగరాల్లో దేశంలోని మొదటి 50 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి వాహన తయారీదారి ఫోర్టమ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.మొదట పైన పేర్కొన్న 5 నగరాల్లోని షోరూమ్‌లలో దీనిని ఏర్పాటు చేయనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios