ఫెరారీ సంస్థ యొక్క మూడవ సరికొత్త మోడల్ ఫెరారీ రోమా సరికొత్త గ్రాండ్ టూరర్ (జిటి). 2020 మొదటి నెలల్లో అంతర్జాతీయంగా రోమా గ్రాండ్ టూరర్ (జిటి) అందుబాటులోకి  రానుంది. కారు యొక్క పేరు ఇటలీ రాజధాని రోమ్ నుండి తీసుకోబడింది. 'లా డోల్స్ వీటా' లేదా లివింగ్ లైఫ్ కేర్‌ ఫ్రీ వంటి నుండి రోమా కార్ ఇన్స్పైర్ చేయబడింది. ఫేరారి రోమా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఫెరారీ రోమా గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ తెలుసుకోవచ్చు.

also read దూసుకొస్తున్న డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4.. వచ్చే ఏడాది విపణిలోకి..

ఫెరారీ రోమా డిజైన్

ఫెరారీ రోమా ఒక అద్భుతమైన కారు! ఫేరరీ డిజైన్  గురించిఫెరారీ కంపెనీ మాట్లాడుతూ 250 జిటి బెర్లినెట్టా లుస్సో నుండి ఈ కారు ఇన్స్పైర్ పొందింది. రోమా  గ్రాండ్ టూరర్ (జిటి)  కారుకి ఇంజిన్ ముందు భాగంలో ఉండటం తో  ఇది లాంగ్ హుడ్ పొందుతుంది. ఫ్రంట్ ఎండ్‌లో బాడీ-కలర్ గ్రిల్‌తో పాటు షార్ప్ ఎల్‌ఈడీ అడాప్టివ్ హెడ్‌ల్యాంప్స్ ఇంకా ఫ్లేర్డ్ ఫెండర్లు దీనికి ఉంటాయి. ఇది రోమాకు స్పోర్టివ్ నెస్ యొక్క భావాన్ని ఇస్తుంది. కారు వెనుక వైపు చూస్తే మీ దృష్టి నేరుగా ఎల్‌ఈ‌డి లైట్స్ మరియు ఇరువైపులా రెండు జతల ఎగ్జాస్ట్ టిప్స్ పై ఉంటాయి. 

ఫెరారీ రోమా ఇంజన్

ఫెరారీ రోమా 3.9-లీటర్ టర్బోచార్జ్డ్ వి 8 ఇంజన్ ను పొందుతుంది. ఇది వరుసగా నాలుగు సంవత్సరాలు ఇంజిన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. దీనికి 3,855 cc ఇంజన్, 5,750 - 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 620 బిహెచ్‌పిని పంపుతుంది. 3,000 - 5,750 ఆర్‌పిఎమ్ వద్ద 760 పీక్ టార్క్ అవుట్పుట్ అందిస్తుంది. ఇందులో కొత్త 8-స్పీడ్  గేర్‌బాక్స్ , డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ని అమర్చారు. ఇది పాత మోడల్ 7-స్పీడ్ గేర్‌బాక్స్  కంటే 6 కిలోల తేలికైనది.

ఫేరరీ రోమా చాసిస్

ఫెరారీ కంపెనీ ఇంజనీర్లు రోమా కారులో కొత్త మాడ్యులర్ టెక్నాలజీని ఉపయోగించారు. బాడీ-షెల్ మరియు ఇంజన్ చాసిస్ రెండూ తక్కువ బరువు కలిగి మరియు అధునాతన ఉత్పత్తి టెక్నాలజితో చేయబడినది.  ఈ కారులో వాస్తవానికి 70 శాతం భాగాలు పూర్తిగా కొత్తవి. 

also read పెరిగిన R E బుల్లెట్ 350 ధరలు.. ఎంతంటే..

ఫేరరీ రోమా ఇంటిరియర్ డిజైన్


కారు క్యాబిన్ రూపకల్పనలో రెండు వేర్వేరు సెల్స్  ఉంటాయి. ఒకటి  డ్రైవర్ మరియు రెండోది తోటి  ప్రయాణీకులకి. ఇది 2+ కూపే అంటే ముందు రెండు సీట్లతో పాటు వెనుక భాగంలో రెండు చిన్న సీట్లు ఉంటాయి. ఇవి సామాను ఉంచడానికి లేదా పిల్లలను కూర్చోపెట్టడానికి ఉపయోగపడతాయి. కారుకి ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, పక్కన 16 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అవసరమైన అన్ని సమాచారలని చూపుతుంది.

ఇంకా మధ్యలో 8.4-అంగుళాల టాబ్లెట్ లాంటి టచ్‌స్క్రీన్ ఉంది. ఇది ఎసి, ఇన్ఫోటైన్‌మెంట్ మరియు మొదలైన వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫెరారీ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్, మ్యాట్రిక్స్ ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌ను ఫీచర్స్ కూడా అందిస్తుంది. దీని ధర పై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.