మారుతి ‘ధరల’ బాంబు: వచ్చే ఏడాది నుంచి కార్లు మరింత భారం
ఇన్ పుట్ వ్యయం పెరిగిపోవడంతో దాని భారం వినియోగదారులపై మోపక తప్పడం లేదని మారుతి సుజుకి తెలిపింది. దీంతో 2020 జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఇప్పటికే ఆటోమొబైల్ సేల్స్ తగ్గుముఖం పడుతున్నాయి. ఆర్థిక మందగమనంపై భయాలను పెంచుతున్నాయి. కానీ వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ కార్ల మోడల్స్‌పై ధరలను పెంచనున్నట్టు ప్రయాణికుల వాహనాల తయారీ సంస్థళ మారుతీ సుజుకి ప్రకటించింది.
ముడిపదార్ధాల ధరలు పెరగడంతో కార్ల ధరలను పెంచడం అనివార్యమైందని వివరణ ఇచ్చిన మారుతి సుజుకి కంపెనీ ఏ వాహనాలపై ధరలను పెంచుతుందనే వివరాలు వెల్లడించలేదు. పలు ముడిపదార్ధాల ధరలు పెరగడంతో గత ఏడాదిగా తమ వాహనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని కార్ల ధరలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మారుతి సుజుకి సెబీకి సమాచారం అందించింది
also read డీజిల్ వాహనాల నిషేధం? ఆ కార్లపైనే కస్టమర్ల మోజు.
ముడిపదార్ధాల ధరలు పెరగడంతో వాహన ధరల పెంపు ద్వారా కొంత భారాన్ని వినియోగదారులపై మోపడం తప్పడం లేదని మారుతి సుజుకి తెలిపింది. జనవరి 2020 నుంచి వివిధ మోడల్స్‌పై పన్ను భారం విభిన్నంగా ఉంటుందని మారుతి పేర్కొంది.
కాగా అక్టోబర్ మినహా ఇటీవల పలు నెలల్లో ఆటోమొబైల్ సేల్స్ గణనీయంగా పడిపోయి ఆటోమొబైల్ పరిశ్రమలో సంక్షోభానికి దారితీసిన సంగతి తెలిసిందే. అమ్మకాలు పడిపోవడంతో పలు దిగ్గజ కంపెనీలు కొన్ని ప్రాంతాల్లో తమ ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసుకున్న పరిస్థితి ఎదురైంది.
also read మహీంద్రా టు మారుతి వయా టాటా మోటార్స్ అంతా డౌన్ ట్రెండే
దేశీయంగా మారుతి సుజుకి తయారు చేసే ఆల్టో, ఎస్-ప్రెస్సో వ్యాగన్ఆర్, స్విఫ్ట్, సెలిరియో, డిజైర్, సియాజ్ మోడల్ కార్ల విక్రయాలు గతవారం 3.2 శాతం తగ్గాయి. స్థానిక డీలర్లకు 1,41,400 వాహనాలను అందజేసింది. అదనంగా టయోటాతో కలిసి గ్లాన్జా మోడల్ కార్లు 2,286 విక్రయించింది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ స్మాల్ కారు ఆల్టో నుంచి ప్రీమియం మల్టీ పర్పస్ వెహికల్ ‘ఎక్స్ఎల్-6’ కారు ధర రూ.2.89 లక్షల నుంచి రూ.11.47 లక్షల వరకు పలుకుతోంది.