డుకాటీ స్క్రాంబ్లర్ 1100, బీఎండబ్ల్యూ ఆర్ నైన్ టీ స్క్రాంబ్లర్ లాంటి బైక్‌లకు పోటీగా ఎఫ్‌టీఆర్ మోడల్ బైక్‌లను ఇండియన్ మోటార్‌సైకిల్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నది.
న్యూఢిల్లీ: అమెరికా మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ ఇండియన్ మోటార్‌సైకిల్స్ రెండు నూతన మోడళ్లను దేశీయ విపణికి పరిచయం చేయనుంది. ఎఫ్‌టీఆర్‌ఎస్ 1200 ఎస్ మోడల్ బైక్‌ను త్వరలో భారత్‌కు తేనున్నారని సమాచారం.
ఇది ఎఫ్‌టీఆర్ 1200 ఎస్, ఎఫ్‌టీఆర్ 1200 ఎస్ రేస్ రెప్లికా అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటిని గత డిసెంబర్‌లోనే భారత విపణిలోకి తీసుకు రావాలని భావించిన కంపెనీ ఎఫ్‌టీఆర్ 1200 ఎస్ ధరను రూ. 14.99 లక్షలుగా, ఎఫ్‌టీఆర్ 1200 ఎస్ రేస్ రెప్లికా ధరను 15.49లక్షలుగా ప్రకటించారు.
తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ మోటార్ సైకిల్స్ సంస్థ ధరలో మార్పులు, చేర్పులు చేస్తుందా? లేదా సంగతి వేచి చూడాల్సి ఉంటుంది. ఎఫ్‌టీఆర్ 750 స్ఫూర్తితో ఎఫ్‌టీఆర్ 1200ఎస్ బైక్ రూపొందించారు.
1203 సీసీ, వీ-ట్విన్ మోటార్‌తో రానున్న ఈ బైక్ 120 బీహెచ్‌పీ, 112.5 ఎన్‌ఎమ్ గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్ స్పియర్డ్ గేర్ బాక్స్‌తోపాటు పలు ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు బైక్‌లో చేర్చారు.
ఇంకా యాంటీ బ్రేకింగ్ సిస్టం, సిక్స్ యాక్సిస్ ఇనర్షియా మేనేజ్‌మెంట్ యూనిట్, ట్రాక్షన్ కంట్రోల్ లాంటి పలు అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి. డుకాటీ స్క్రాంబ్లర్ 1100, బీఎండబ్ల్యూ ఆర్ నైన్ టీ స్క్రాంబ్లర్ లాంటి బైక్‌లకు పోటీగా వీటిని ఇండియన్ మోటార్‌సైకిల్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.
