మీ బైక్ లేదా కార్ ఆర్‌సి పోయిందా.. అయితే మళ్ళీ ఇలా తీసుకోవచ్చు..

సాధారణంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్లాస్టిక్ కార్డుపై ప్రింట్ చేస్తారు. ఇంతకు ముందు పేపర్ పై ప్రింట్ చేసేవారు. ఒకోసారి కొందరు ఒరిజినల్ ఆర్‌సిని కూడా పోగొట్టుకుంటుంటారు. దానిని తిరిగి ఎలా పొందాలో కూడా తెలీదు.

If your RC is lost then do not worry get duplicate rc of your vehicle like this

వెహికిల్ ఆర్‌సి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని అర్ధం, ఆర్‌సి వాహన ఓనర్ కి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. సింపుల్ గా చెప్పాలంటే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వాహనం ఏ వ్యక్తికి చెందినదని ఇంకా రీజనల్  ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ (RTO)లో రిజిస్టర్ చేయబడిందని నిరూపించే డాక్యుమెంట్. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌పై వాహన పూర్తి వివరాలను ప్రింట్ చేసి ఉంటాయి. ఇందులో ఇంజన్ నంబర్, ఛాసిస్ నంబర్, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ ఇంకా వాహన ఓనర్ సమాచారం ఉంటుంది. 

సాధారణంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్లాస్టిక్ కార్డుపై ప్రింట్ చేస్తారు. ఇంతకు ముందు పేపర్ పై ప్రింట్ చేసేవారు. ఒకోసారి కొందరు ఒరిజినల్ ఆర్‌సిని కూడా పోగొట్టుకుంటుంటారు. దానిని తిరిగి ఎలా పొందాలో కూడా తెలీదు. విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితులలో ఆర్‌టి‌ఓ మీకు డూప్లికేట్ ఆర్‌సి జారీ చేయగలదు. ఒక వ్యక్తి తన వాహనానికి డూప్లికేట్ ఆర్‌సిని ఎలా పొందవచ్చో తెలుసుకోండి...

మొదట ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ అఫిషియల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. "ఆన్‌లైన్  సర్వీసెస్" ట్యాబ్ కింద "వెహికిల్ సర్వీసెస్"పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ  స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు, మీరు తెలంగాణ నివాసి అయితే తెలంగాణ  అని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత వెబ్‌సైట్ మీ స్టేట్ వెహికిల్ ట్రాన్స్ పోర్ట్ వెబ్‌సైట్‌కి మళ్లించబడుతుంది. 

తరువాత ఒక పాప్-అప్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది, దాని ద్వారా "వెహికిల్ సర్వీసెస్" క్రింద ఉండే "ఇష్యూ డూప్లికేట్ ఆర్‌సి"పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు అక్కౌంట్ ఉంటే లేదా రిజిస్టర్ చేసుకోని లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత "ఆన్‌లైన్ సర్వీసెస్" కింద, "వెహికిల్ సర్వీసెస్" ఆప్షన్ ఉంటుంది. 

నెక్స్ట్ వాహన వివరాలను నింపల్సి ఉంటుంద.  ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఛాసిస్ నంబర్‌ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ అండ్ OTPని ఎంటర్ చేయడం ద్వారా వెర్ఫికేషన్ పూర్తి చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత, స్క్రీన్ పై కొన్ని ఆన్‌లైన్ సర్వీస్ చూపిస్తుంది. "ఇష్యూ ఆఫ్ డూప్లికేట్ ఆర్‌సి" ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై నొక్కండి. ఫారమ్‌ నింపిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ రూపొందించబడుతుంది. 

దీని తర్వాత ఈ-సంతకం చేసి డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు మీరు e-KYC పూర్తి చేసి పేమెంట్ చేయాలి. RTO దరఖాస్తును ఆమోదించిన తర్వాత వారు స్పీడ్ పోస్ట్ ద్వారా డూప్లికేట్ ఆర్‌సి మీ అడ్రస్ కి పంపుతారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios