Asianet News TeluguAsianet News Telugu

6 నెలల్లో 1లక్ష బుకింగ్‌లను దాటిన హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్  కంపెనీ ఇప్పటికే అక్టోబర్ 2019 నాటికి భారతదేశంలో 51,000 యూనిట్లకు పైగా హ్యుందాయ్  వెన్యూ  కార్లని విక్రయించింది. బ్లూలింక్ కనెక్ట్  టెక్నాలజీతో ఈ వేరియంట్‌ కార్  కొనుగోలు చేయడానికి 50 శాతం మంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

hyundai venue booking crosses 1 lakh in 6 months
Author
Hyderabad, First Published Nov 30, 2019, 4:17 PM IST

హ్యుందాయ్ వెన్యూ కార్ మే నెలలో ప్రారంభించినప్పటి నుండి హ్యుందాయ్  కంపెనీ ఇప్పటికే అక్టోబర్ 2019 నాటికి భారతదేశంలో 51,000 యూనిట్లకు పైగా హ్యుందాయ్  వెన్యూ  కార్లని విక్రయించింది. బ్లూలింక్ కనెక్ట్  టెక్నాలజీతో ఈ వేరియంట్‌ కార్  కొనుగోలు చేయడానికి 50 శాతం మంది వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

హ్యుందాయ్ ఇండియా తన కనెక్ట్ చేసిన సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ కోసం మంచి డిమాండ్ సాధిస్తున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ వెన్యూ  కోసం 1 లక్ష బుకింగ్‌లతో 2019 క్యాలెండర్ సంవత్సరాన్ని ముగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మే నేలలో ఈ మోడల్ కారు ప్రారంభించినప్పటి నుండి హ్యుందాయ్  సంస్థ ఇప్పటికే అక్టోబర్ 2019 నాటికి భారతదేశంలో 51,257 యూనిట్ల వెన్యూ కార్లను విక్రయించింది.

also read  బీఎస్-4 వద్దు...బీఎస్-6 ముద్దు...వాహనాల తయారీ సంస్థలు

గత నెల వరకు కంపెనీ సబ్ -4 మీటర్ ఎస్‌యూవీ కోసం 75,000 ఆర్డర్‌లను అందుకుంది. ఇంతకుముందు హ్యుందాయ్ 50 శాతం మంది కస్టమర్లు బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారని ఇది ఎస్ఎక్స్ డిసిటి మరియు టాప్-ఎండ్ ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్‌లతో అందించబడుతుంది.

hyundai venue booking crosses 1 lakh in 6 months

భారత మార్కెట్లో మంచి స్పందనతో హ్యుందాయ్ ఇప్పుడు ఎస్‌యూవీని విదేశీ మార్కెట్‌కు ఎగుమతి చేయడం ప్రారంభించింది. ఇటీవల భారతదేశంలో నిర్మించిన వెన్యూ కార్ 1400 యూనిట్లను దక్షిణాఫ్రికాకు రవాణా చేసింది. హ్యుందాయ్ వెన్యూ డిసెంబర్ 2, 2019న దక్షిణాఫ్రికాలో విక్రయించనున్నారు. రైట్-హ్యాండ్-డ్రైవ్ (ఆర్‌హెచ్‌డి)తో పాటు, కంపెనీ లెఫ్ట్-హ్యాండ్-డ్రైవ్ (ఎల్‌హెచ్‌డి) హ్యుందాయ్ వెన్యూను తయారు చేసి ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాకు వీటిని ఎగుమతి చేస్తుంది . ప్రస్తుతం ఎల్‌హెచ్‌డి మోడల్ అభివృద్ధిలో ఉంది.

హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి కనెక్ట్ టెక్నాలజి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ  కారు. ఇండియన్-యాసెంట్ ఇంగ్లీష్ వాయిస్ అసిస్ట్ సిస్టమ్, రిమోట్ ఇంజిన్-స్టార్ట్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ వంటి అనేక సెగ్మెంట్లలో ఫస్ట్ ఫీచర్లతో అందించబడుతుంది.

also read మాకు భాగ్య నగరమే భాగ్యరేఖ...: స్కోడా డైరెక్టర్

సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 8.4-అంగుళాల హెచ్‌డి డిస్ప్లే స్క్రీన్, ఎకో-కోటింగ్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, వీల్ ఎయిర్ కర్టెన్లు ఇతర సెగ్మెంట్-ఫస్ట్ కంఫర్ట్ ఫీచర్లు దీని ప్రత్యేక ఫీచర్లు. భారతీయ ప్రాంతీయ భాషలను గుర్తించడానికి బ్లూలింక్ కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీని ప్రోగ్రామింగ్ చేయడానికి హ్యుందాయ్ ప్రయత్నిస్తుంది.


హ్యుందాయ్ వెన్యూ మూడు ఇంజన్ ఆప్షన్లలో వస్తుంది. 1.0-లీటర్ వేరిఏంట్ లో త్రీ సిలిండర్ల టర్బోచార్జ్డ్ మోటారు 118 బిహెచ్‌పి మరియు 172 ఎన్ఎమ్ పీక్ టార్క్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ జతచేయబడుతుంది. 1.2-లీటర్ వేరిఏంట్ లో ఫోర్-సిలిండర్ ఇంజిన్,  82 బిహెచ్‌పి మరియు 114 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. చివరగా 1.4-లీటర్ వేరిఏంట్ లో ఫోర్-సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ , 89 బిహెచ్‌పి మరియు 220 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది ఇందులో సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ జతచేయబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios