హైదరాబాద్: దేశీయ మార్కెట్లో సుస్థిరమైన స్థానం సాధించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది స్కోడా. తమకు హైదరాబాద్ నగర మార్కెట్ చాలా కీలకం అని ఆ సంస్థ డైరెక్టర్ జాక్ హోలిస్ చెప్పారు. భారతదేశంలో తమ భవిష్యత్ ప్రణాళిక అమలుకు హైదరాబాద్ వంటి నగరాల్లో మార్కెట్లు కీలకం కానున్నాయన్నారు.ఇప్పటికే నాలుగు మోడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న తాము వచ్చే రెండేండ్లకాలంలో మరో ఎనిమిది మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. 

2020లో రూ.20 లక్షల్లోపు విలువైన మూడు సెడాన్ మోడల్ కార్లు, ఒక ఎస్ యూవీ కారును విపణిలో విడుదల చేసే అవకాశం ఉందని స్కోడా ఆటో ఇండియా డైరెక్టర్ జాక్ హోలిస్ చెప్పారు. ఆటోమొబైల్ రంగం ఆర్థిక మందగమనం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. అది మరింత కాలం కొనసాగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.

also read  ఎలక్ట్రిక్ వాహనాలు: తోషిబా సంస్థతో కేరళ ప్రభుత్వం డీల్...

దేశవ్యాప్తంగా 53 నగరాల్లో 65 షోరూంలను ఏర్పాటు తాము వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్లు స్కోడా ఆటో డైరెక్టర్ జాక్ హోలిస్ ప్రకటించారు. కంపెనీ మొత్తం విక్రయాల్లో హైదరాబాద్ వాటా 6.5 శాతంగా ఉండగా, వచ్చే ఏడాది ఇది 8.5 శాతానికి చేరుకోనున్నది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 1,565 కార్లు అమ్ముడవగా, వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 1,126 యూనిట్లను విక్రయించింది సంస్థ.

ఈ ఆర్థిక సంవత్సరంలో 16 వేల కార్ల విక్రయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న స్కోడా ఆటో ఇండియా 2025 నాటికి ఏటా లక్ష కార్లను అమ్మాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఇతర కంపెనీలు కూడా ఎస్ యూవీ మిడ్ సైజ్ కార్లను విడుదల చేయడంలో పూర్తిగా నిమగ్నం అవుతాయి. హ్యుండాయ్, కియా, ఎంజీ మోటార్స్ ఇప్పటికే సంప్రదాయ హ్యాచ్ బ్యాక్ కార్ల కంటే ఎస్ యూవీ మోడళ్ల ఆవిష్కరణలో విజయం సాధించాయి. తాము 2021లో వారితో జత కలుస్తామని జాక్ హోలిస్ తెలిపారు. 

also read రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త ఫ్లాట్-ట్రాక్ బైక్‌...

ఢిల్లీలో వచ్చే ఏడాది జరిగే మోటారు షోలో కాన్సెప్ట్ కారును ఆవిష్కరిస్తున్నట్లు స్కోడా ఆటో ఇండియా తెలిపింది. ప్రస్తుతం స్కోడా కొడియాక్ స్కౌట్ మోడల్ కారు రూ.34 లక్షలకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశ విపణిలో రూ.8000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. పుణెలో తమ కార్యకలాపాలను విస్తరిస్తుందని తెలిపింది.