ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా నుండి  2013 లొ విడుదలైన గ్రాండ్ ఐ10 మోడల్ కారు ఇండియన్ మార్కెట్ ను ఊపేసిన విషయం తెలిసిందే. ఈ మోడల్ కారుకి ఇప్పటికీ వినియోగదారుల నుండి ఆధరణ తగ్గలేదు. అయితే కొత్తగా ఈ కారు తీసుకోవాలనుకునే కస్టమర్లకు కంపెనీ చేదు వార్త అందించింది. ఈ గ్రాండ్ ఐ10 కారు ధరను పెంచుతున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది. 

గ్రాండ్ ఐ10 మోడల్ ధరలను 3 శాతం పెంచనున్నట్లు హ్యుందాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అంటే దాదాపు ఈ కారు ధర 20 వేల నుండి 25 వేల వరకు పెరగనుంది. దీంతో మధ్యతరగతి వినియోగదారులు దీన్ని కొనాలంటే కాస్త ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు హ్యుందాయ్ కంపెనీ నుండి బెస్ట్ సెల్లింగ్ కార్ల లిస్ట్ లో నిలిచిన గ్రాండ్ ఐ10 విక్రయాలపై ఈ పెంపు ప్రభావం పడనుంది. 
 
ముడిసరుకుపై పెట్టుబడి పెరగడం మరియు తయారీ ఖర్చులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. సవరించబడిన కొత్త ధరలు ఆగస్టు నుండి 1 వ తేధీ నుండి అమల్లోకి వస్తాయని హ్యందాయ్ ప్రతినిధులు తెలిపారు.