Asianet News TeluguAsianet News Telugu

దూరం దూరం..! భారత్‌ విపణికి ‘హోండా కార్స్’ సీఆర్-వీ ‘నో’ !!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ తాజాగా హెచ్ఆర్-వీ కారు రూపుదిద్దుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తుది త్రైమాసికంలో విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ దేశీయంగా కార్ల విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఇప్పట్లో భారత విపణిలో విడుదల చేసేందుకు హోండా మేనేజ్మెంట్ వెనుకాడుతున్నదని సమాచారం.

Honda HR-V not to be launched in India
Author
New Delhi, First Published Sep 3, 2019, 10:38 AM IST

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ త్వరలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హెచ్ఆర్-వీ మోడల్ కారును భారతదేశ విపణిలో ఆవిష్కరిస్తుందని ఇప్పటి వరకు అంతా భావించారు. హోండా కార్స్ ఆధ్వర్యంలోని హెచ్ఆర్-వీ మోడల్ కారు ప్రత్యర్థి సంస్థలైన కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్, టాటా హరియర్, రెనాల్డ్ క్యాప్చర్, హ్యుండాయ్ క్రెటా మోడల్ కార్లకు గట్టి పోటీనిస్తుందని అంతా భావిస్తున్నారు.

కానీ మారిన ప్రస్తుత పరిస్థితుల్లో హోండా కార్స్ తన హెచ్ఆర్-వీ మోడల్ కారును భారతదేశ విపణిలో ఆవిష్కరించేందుకు వెనుకాడుతోంది. ప్రాథమికంగా కారు ధర అత్యధికంగా ఉండటమే కారణమని హోండా కార్స్ వర్గాలు తెలిపాయి. 

ఈ ఏడాది ప్రారంభంలో నొయిడాలోని హోండా కార్ల తయారీ యూనిట్‌లో టెస్ట్ మ్యూల్ చేపట్టింది. మేమంతా చివరి త్రైమాసికంలో భారత విపణిలోకి హోండా కార్స్ ‘హెచ్ఆర్-వీ’ అడుగు పెడుతుందని ఆశించారు. హోండా కార్స్ రూపొందిస్తున్న హెచ్ఆర్-వీ కారు తన ప్రత్యర్థి సంస్థలు కియా మోటార్స్ వారి సెల్టోస్, ఎంజీ హెక్టార్, టాటా హరియర్, రెనాల్ట్ క్యాప్చర్, హ్యుండాయ్ క్రెట్టా కార్లతో విపణిలో పోటీ పడుతుందని భావిస్తున్నారు. 

హోండా హెచ్ఆర్-వీ కారులో వాడే కాంపొనెంట్స్‌లో 30 శాతం స్థానిక కంపెనీలు తయారుచేసినవే వాడింది. అయితే 70 శాతం కంపొనెంట్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం వల్లే ఈ కారు ధర ఎక్కువగా పలికిందని తెలుస్తోంది. భారతదేశంలో తమ భవిష్యత్ మార్కెట్‌కు ప్రస్తుత పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని హోండా కార్స్ భావిస్తోంది. 

హోండా హెచ్ఆర్-వీ కారులో క్రోమ్ గ్రిల్లె, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రెక్టాంగ్యులర్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, షార్క్ -ఫిన్ ఎంటీనా, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, డిజిటల్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు చేర్చారు. అధికారికంగా వెల్లడించకున్నా హెచ్ఆర్-వీ కారులో హోండా సివిక్‍లో వాడిన ఇంజిన్‌నే వాడుతున్నారు. ఈ కారులో 1.8 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్, 1.6 లీటర్ల సామర్థ్యం గల ఐ-డీటెక్ టర్బో డీజిల్ మోటార్ వాడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios