Asianet News TeluguAsianet News Telugu

Price Hike:ఏప్రిల్ 5 నుండి హీరో మోటోకార్ప్ వాహనాల ధరల పెంపు.. ఏ బైక్ పై ఎంత పెరుగుతుందంటే..?

హీరో మోటోకార్ప్  మొత్తం ఉత్పత్తి  ఎక్స్-షోరూమ్ ధరలు పెంచబడతాయి. అలాగే వాహనాల ధరలు రూ.2,000 వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. అయితే, ధరల పెంపు మోడల్, మార్కెట్ ఆధారంగా ఉంటుంది. 

Hero MotoCorp will increase the prices of all models from April 5
Author
Hyderabad, First Published Mar 31, 2022, 2:09 PM IST

దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్(Hero MotoCorp) ఏప్రిల్ 5 నుంచి  హీరో బైక్స్ అండ్ స్కూటర్ల ధరలను రూ.2,000 వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న కమోడిటీ ధరలకు ధర మార్పు కారణమని కంపెనీ పేర్కొంది. ఈ  ప్రభావాన్ని పాక్షికంగా ఆఫ్‌సెట్ చేయాలని భావిస్తోంది. 

హీరో మోటోకార్ప్  మొత్తం ఉత్పత్తి  ఎక్స్-షోరూమ్ ధరలు పెంచబడతాయి. అలాగే వాహనాల ధరలు రూ.2,000 వరకు పెరుగుతాయని కంపెనీ తెలిపింది. అయితే, ధరల పెంపు మోడల్, మార్కెట్ ఆధారంగా ఉంటుంది. 

ఈ నిర్ణయంతో ద్వారా, Hero MotoCorp, Toyota Kirloskar Motor, Audi, BMW, Mercedes-Benz వంటి ఇతర వాహన తయారీదారుల జాబితాలో చేరింది.  ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా ఇప్పటికే  ఈ కంపెనీ వచ్చే నెల నుండి ధరల పెంపు వర్తిస్తుందని  ప్రకటించాయి. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమని ఈ కంపెనీలు పేర్కొన్నాయి. 

గత వారం, BMW  అన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్ 1 నుండి 3.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న మెటీరియల్ అండ్ లాజిస్టిక్స్ ఖర్చులతో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితి, మారకపు రేటు ప్రభావానికి ధరల పెంపు అవసరమైన సర్దుబాటు అని కంపెనీ పేర్కొంది. 

మెర్సిడెస్  ఉత్పత్తుల ధరలను కూడా ఏప్రిల్ 1 నుండి దాదాపు మూడు శాతం పెంచుతోంది. కారు ధరలను కనీసం రూ.50,000 వరకు పెంచవచ్చని, గరిష్టంగా రూ.5 లక్షల వరకు పెంపు ఉంటుంది కంపెనీ పేర్కొంది. ధర మార్పు కారణంగా ప్రభావితమయ్యే మోడల్‌లలో A-క్లాస్, E-క్లాస్, S-క్లాస్ లిమోసిన్లు, GLA, GLC, GLS, AMG GT 63S ఫోర్-డోర్ కూపే ఉన్నాయి. 

టయోటా కిర్లోస్కర్ ముడిసరుకుతో సహా పెరుగుతున్న ధరల కారణంగా ఏప్రిల్ 1 నుండి అన్నీ మోడల్ ధరలను నాలుగు శాతం పెంచనుంది. అయితే, పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని కస్టమర్లపై తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా కంపెనీ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios