మరో రెండు నెలల్లో హీరో మోటోకార్ప్ 10 కొత్త మోడళ్లు..!
కాలుష్య నియంత్రణ కోసం బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా పాత మోడళ్లను ఆధునీకరించడంలో హీరోమోటార్స్ దూకుడు పెంచింది. మరో నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మొత్తం 10 మోడళ్లకు కొత్త నిబంధనలకనుగుణంగా మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. బీఎస్-6 ఉద్గార నియమాలతో తొలి మోడల్ విక్రయాలను ఇదివరకే ప్రారంభించింది హీరో మోటార్స్.
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ 10 మోడల్ మోటారు సైకిళ్లను బీఎస్-6 నిబంధనల ప్రకారం త్వరలోనే ఆధునీకరించనున్నట్లు ప్రకటించింది. వీటిలో ఐదు మోడళ్లు ఎక్కువగా అమ్ముడయ్యే విభాగంలోవేనని పేర్కొంది.
also read ద్విచక్ర వాహన తయారీలోకి ప్రవేశించడం పొరపాటే: ఆనంద్ మహీంద్రా
2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 ఉద్గార నియమాలు తప్పని సరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ గడువులోపే.. తమ మోడళ్లను బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా ఆధునీకరించనున్నట్లు కంపెనీ అధికారిక వర్గాలు తెలిపాయి.
2020 ఫిబ్రవరిలో జైపూర్లోని సంస్థ పరిశోధన కేంద్రం (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ)లో భారీగా ఓ ప్రదర్శన నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. వచ్చే 4-8 వారాల్లో కంపెనీ స్ల్పెండర్, హెచ్ఎఫ్ డీలక్స్, గ్లామర్, మ్యాస్ట్రో సహా మొత్తం 10 మోడళ్లను బీఎస్-6 వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నట్లు హీరో మోటార్స్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
also read జనవరి నుంచి ఆ కార్లు కొనటం కొంచెం కాస్ట్‌లీనే....
ఆ సంస్థ తొలి బీఎస్-6 ప్రమాణాలు పాటించే బైక్.. 'స్ల్పెండర్ ఐ స్మార్ట్' విక్రయాలను నవంబర్ నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. అన్ని మోడల్ మోటారు సైకిళ్లపై వచ్చే నెల నుంచి హీరో మోటో కార్ప్స్ రూ.2000 పెంచుతున్న సంగతి తెలిసిందే.