హీరో మోటోకార్ప్ కొత్త టూరింగ్ బైక్.. అప్‌గ్రేడ్ ఇంజన్‌తో డ్యూక్ లాంటి కొత్త కలర్ స్కీమ్..
రాబోయే హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి తాజాగా ఇండియాలో ఒక టీవీ యాడ్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు కనిపించింది. అయితే దీని ప్రత్యేకత ఏంటి అనేది వీడియోలో కవర్ కాలేదు.
ఇండియాలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సోషల్ మీడియాలో రాబోయే ఎక్స్ పల్స్ 200టి 4వి అఫిషియల్ టీజర్‌ను లాంచ్ చేసింది. టిజర్ ప్రకారం కొత్త 2022 హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి త్వరలోనే రానుంది. అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో పాటు, అప్‌డేట్ చేసిన ఎక్స్ పల్స్ 200టి కూడా కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లు, కొత్త కలర్ స్కీమ్‌ను పొందే అవకాశం ఉంది.
రాబోయే హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి తాజాగా ఇండియాలో ఒక టీవీ యాడ్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు కనిపించింది. అయితే దీని ప్రత్యేకత ఏంటి అనేది వీడియోలో కవర్ కాలేదు. బైక్ కి ఫోర్క్ కవర్ గెట్టర్స్, హెడ్‌ల్యాంప్ పైన కొత్త వైజర్, కొత్త పెయింట్ స్కీమ్ ఇంకా మరిన్ని ఫీచర్స్ ఉన్నాయని లీక్ అయిన ఫోటోలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ టూరింగ్ బైక్ కి అతిపెద్ద అప్‌డేట్ దాని పవర్‌ట్రైన్.
ఇంజన్ అండ్ ఫీచర్లు
కొత్త హీరో ఎక్స్ పల్స్ 200టి 4వి 199.6cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్, 4-స్ట్రోక్, 4-వాల్వ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ 18.9 బిహెచ్‌పి, 17.35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఎక్స్ పల్స్ 200టి 4వి టర్న్-బై-టర్న్ నావిగేషన్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌తో బ్లూటూత్-ఆధారిత డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుందని భావిస్తున్నారు.
బ్రేకింగ్, సస్పెన్షన్
బైక్ హార్డ్‌వేర్ వివరాలలో ఎలాంటి మార్పు ఉండదు. సస్పెన్షన్ కోసం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ అండ్ వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్‌లను పొందుతుంది. బ్రేకింగ్ కోసం బైక్ సింగిల్-ఛానల్ ABSతో పాటు రెండు వీల్స్ పై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.
ధర ఎంతంటే
హీరో ఎక్స్ పల్స్ 200టి ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.24 లక్షలు. అయితే రాబోయే 4V మోడల్ ధర దీని కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.