Asianet News TeluguAsianet News Telugu

మీరు సరైన హెల్మెట్ కొనడం ఎలా, సేఫ్ జర్నీ కోసం ఈ ఐదు టిప్స్ గుర్తుంచుకోండి..

చలాన్ రాకుండా ఉండేందుకు చాలా మంది హెల్మెట్ ధరిస్తుంటారు. కానీ ఆ హెల్మెట్ సరైనది కాదు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల చలాన్‌లను తప్పించుకోవడమే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు తలకు, మొఖానికి బలమైన గాయం కాకుండా కూడా కాపాడుకోవచ్చు.

Helmet Buying Tips: How to buy the right helmet for yourself, keep these five tips in mind for a safe journey
Author
First Published Feb 20, 2023, 12:14 PM IST

బైక్ నడపడం నుండి మనల్ని సురక్షితంగా ఉంచుకోవడం వరకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. చాలా సార్లు ప్రజలు డబ్బు ఆదా చేయడానికి కొన్ని నాణ్యతా లేని హెల్మెట్‌లను కొంటుంటారు, అయితే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ద్విచక్ర వాహనదారుని ప్రాణాలను రక్షించే హెల్మెట్ నాణ్యతా లేకపోవడంతో ఒకోసారి తీవ్రంగా నష్టపోతుంటారు. మీరు సరైన హెల్మెట్ ఎలా ఎంచుకోవాలి, ఏ విధంగాఉపయోగించాలి ఇలాంటి విషయాలు మీకోసం... 

హెల్మెట్ ఎందుకు అవసరం
చలాన్ రాకుండా ఉండేందుకు చాలా మంది హెల్మెట్ ధరిస్తుంటారు. కానీ ఆ హెల్మెట్ సరైనది కాదు. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల చలాన్‌లను తప్పించుకోవడమే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు తలకు, మొఖానికి బలమైన గాయం కాకుండా కూడా కాపాడుకోవచ్చు.

స్టైలిష్ హెల్మెట్‌లకు దూరంగా ఉండండి

ఈ రోజుల్లో మార్కెట్‌లో చాలా రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. హెల్మెట్‌లలో ఎన్నో ఆప్షన్లు ఆన్‌లైన్ ఇంకా ఆఫ్‌లైన్‌లో ప్రతిచోటా చూస్తుంటారు. కొన్ని హెల్మెట్లను చూడగానే వాటిని కొనాలనిపిస్తుంది. కానీ స్టైలిష్ హెల్మెట్‌తో సేఫ్టీ కూడా అవసరం. అందుకే స్టైలిష్‌గా ఉండే హెల్మెట్‌లకు బదులు తల, నోటిని పూర్తిగా కప్పి ఉంచే హెల్మెట్‌నే కొనడం మంచిది.

నాణ్యత ముఖ్యం
కొన్నిసార్లు కొంత డబ్బు ఆదా చేసేందుకు తక్కువ ధరకే హెల్మెట్‌లను కొంటుంటారు. ఇలాంటి హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్నప్పుడు ఒకోసారి పోలీసులు కూడా అడ్డుకుని చలాన్ జారీ చేస్తారు. అలాగే  ప్రమాద సమయంలో తక్కువ నాణ్యత కలిగిన హెల్మెట్‌లు త్వరగా విరిగిపోతాయి, ఈ కారణంగా ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు అందుకే ఐఎస్‌ఐ మార్కు ఉన్న మంచి హెల్మెట్‌ను కొనడం మంచిది.

సైజ్ కూడా ముఖ్యం
మీరు హెల్మెట్ కొనడానికి వెళ్లినప్పుడల్లా దాన్ని క్షుణ్ణంగా చెక్ చేయండి. మీరు నాణ్యతతో సంతృప్తి చెందిన తర్వాత, దానిని ధరించడానికి ప్రయత్నించండి. ప్రతి వ్యక్తి తల సైజ్ భిన్నంగా ఉంటుంది, అయితే హెల్మెట్లు అనేక సైజ్ లలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా హెల్మెట్ కొంటె అది మీకు సరిపోతుందో లేదో చూసుకోండి ఇంకా అది చాలా టైట్ గా లేదా లుజ్ గా ఉంటే, మరొక హెల్మెట్ తీసుకోవడం మంచిది.

అద్దం కూడా అవసరం
చాలా హెల్మెట్‌లు నలుపు-తెలుపు గ్లాసులతో వస్తాయి. మీరు హెల్మెట్ కొనుగోలు చేస్తే, దాని అద్దాన్ని కూడా పరిగణించండి. మీరు పగటిపూట మాత్రమే ద్విచక్ర వాహనం నడుపుతున్నట్లయితే, మీరు ఫిల్మ్ మౌంటెడ్ హెల్మెట్ తీసుకోవచ్చు. కానీ చాలా మంది ట్రాన్స్పరెంట్ గా  కనిపించే గ్లాస్ హెల్మెట్ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇలాంటి సమయంలో, గాజు   నాణ్యతనగా ఉండటం అవసరం.
 

Follow Us:
Download App:
  • android
  • ios