gift to speed lovers:కొత్త కవాసకి నింజా-300 లాంచ్.. నిమిషానికి దీని స్పీడ్ ఎంతో తెలుసా..?

దీని ప్రారంభ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.37 లక్షలు. గతంలో దీని ధర 3.24 లక్షలు ఉంది. అంటే కొత్త మోడల్ కోసం కస్టమర్లు రూ.13 వేలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. 

gift to speed lovers: New Kawasaki Ninja-300 launched, will be able to travel 200 km in one hour

దేశంలోని స్పీడ్ లవర్స్ కి కవాసకి ఇండియా ఓ పెద్ద గిఫ్ట్ అందించింది. కంపెనీ కొత్త కవాసకి నింజా-300ని లాంచ్ చేసింది. ప్రస్తుతం దీని బుకింగులు ప్రారంభమైయ్యాయి. గంటలో 200 కి.మీ దుసుకెళ్లే  ఫీచర్లను ఇందులో అమర్చారు. 

బైక్ అండ్ స్పీడ్ లవర్స్ కి దీని ఫీచర్లు ధర కంటే ఎక్కువ ఆకర్షణకు కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కవాసకి ఇండియా నింజా 2022 మోడల్‌లో గ్రాఫిక్స్ స్థాయిలో ఎన్నో మార్పులు చేసింది. ఇప్పుడు ఈ మార్పులు పాత మోడల్ కంటే బోల్డ్, ఆకర్షణీయంగా ఉంటాయి. దీని ప్రారంభ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.37 లక్షలు. గతంలో దీని ధర 3.24 లక్షలుగా ఉండేది. అంటే కొత్త మోడల్ కోసం కస్టమర్లు రూ.13 వేలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. 

*నింజా-300 ఫీచర్లు
*కొత్త కవాసకి నింజా 300 మూడు రంగులలో లభిస్తుంది - లైమ్ గ్రీన్, క్యాండీ లైమ్ గ్రీన్ అండ్ ఎబోనీ. క్యాండీ లైమ్ గ్రీన్, ఎబోనీ పెయింట్ ఆప్షన్‌లో కొత్త గ్రాఫిక్స్ ఉంటాయి. 
*నింజా 300  ఫెయిరింగ్ అండ్ ఫ్యుయెల్ ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్ ఇచ్చారు. బైక్ ఇంజన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. 
*2022 కవాసకి నింజా 300 BS6 296cc, పారలెల్-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో అందించబడుతుంది.
*ఈ ఇంజన్ 38.4bhp పవర్, 27Nm పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 
*ఇంజిన్‌కి ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఇచ్చారు. గరిష్ట వేగం గంటకు 192 కిలోమీటర్లు. ఇంకా 6.6 సెకన్లలో సున్నా నుంచి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios