Asianet News TeluguAsianet News Telugu

ఐదు నిమిషాల్లో చార్జింగ్.. 70 కి.మీ కెపాసిటీ .. అదరిన్ ‘ఎరిక్’ ఆటో

సింగపూర్ సంస్థ షాడో గ్రూప్ అనుబంధ అదరిన్ ఆటోమొబైల్స్ వినియోగదారులకు అత్యంత చౌక విద్యుత్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఐదు నిమిషాల్లో బ్యాటరీ చార్జింగ్ సామర్థ్యం గల ఆటోను అభివ్రుద్ధి చేసిన అదరిన్ సంస్థ వచ్చే అక్టోబర్ నెలలో బారత విపణిలోకి ప్రవేశ పెట్టనున్నది. 

First instantly-charging electric 3-wheeler unveiled
Author
Hyderabad, First Published Aug 16, 2019, 10:38 AM IST

హైదరాబాద్: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో ఇప్పుడు ‘పవర్‌’ హాట్‌ టాపిక్‌గా మారింది. విద్యుత్ వాహన రంగ కంపెనీలు అధిక సామర్థ్యం గల బ్యాటరీల తయారీపై దృష్టి సారించాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీలో పేరొందిన సింగపూర్‌ సంస్థ షాడో గ్రూప్‌ అనుబంధ కంపెనీ అదరిన్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్‌ ఓ అడుగు ముందుకేసింది. 

బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదరిన్ ఇంజినీరింగ్ టెక్నాలజీస్.. అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీని అభివృద్ధి చేసింది. అయిదు నిమిషాల్లోనే చార్జింగ్‌ పూర్తి అవడం దీని స్పెషాలిటీ. ఎరిక్‌ పేరుతో రూపొందించిన త్రిచక్ర వాహనానికి ఈ బ్యాటరీని తయారు చేసింది. 

బ్యాటరీని ఒకసారి చార్జింగ్‌ చేస్తే వాహనం 70 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్‌ మ్యూనిచ్‌ ఈ టెక్నాలజీని ధ్రువీకరించింది. అంతేకాదు 10 ఏళ్లపాటు మన్నిక కలిగి ఉంటుందని షాడో గ్రూప్‌ కో–సీఈవో సౌరభ్‌ మార్కండేయ వెల్లడించారు. డీజిల్‌ వెహికల్‌తో పోలిస్తే ఖర్చు 25–30 శాతం తగ్గుతుందని చెప్పారు.

ఎరిక్‌ బ్రాండ్‌లో ప్యాసింజర్‌ వేరియంట్‌తోపాటు కార్గో వాహనాలను కూడా రూపొందించారు. ప్యాసింజర్‌ వాహనం గంటకు 50 కిలోమీటర్లు, కార్గో మోడల్‌ 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కార్గోలో 550 కిలోల సరుకు రవాణా చేయవచ్చు. రెండు రకాల బ్యాటరీలను అందుబాటులోకి తెచ్చామని సౌరభ్‌ మార్కండేయ తెలిపారు.

అల్ట్రా కెపాసిటర్‌ బ్యాటరీ జీవిత కాలం 10 ఏళ్లు. ధర రూ.4 లక్షలు. లిథియం అయాన్‌ బ్యాటరీ జీవిత కాలం రెండున్నరేళ్లు. చార్జింగ్‌కు 8 గంటలు పడుతుంది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 80–100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ధర రూ. లక్ష ఉంది. అల్ట్రా కెపాసిటర్‌ అభివృద్ధికి రెండేళ్లు పట్టింది.

ఈ మోడల్‌ వాహనాలు ఇండోనేషియాకు ఎగుమతి చేయనున్నాం. భారత్‌లో క్యాబ్‌ అగ్రిగేటర్లు, లాజిస్టిక్స్‌ కంపెనీలతో మాట్లాడుతున్నామని షాడో గ్రూప్‌ కో–సీఈవో సౌరభ్‌ మార్కండేయ చెప్పారు. వచ్చే అక్టోబర్ నుంచి మార్కెట్లో వాహనం అందుబాటులో ఉంటుంది’ అని చెప్పారు. పుణేలో ఉన్న ప్లాంట్ కోసం షాడో గ్రూప్‌ రూ.70 కోట్లు వెచ్చిస్తోంది. మలేషియాలోని మలక్కాలో ఆర్ అండ్ డీ యూనిట్ కలిగి ఉంది. 

సంప్రదాయ పెట్రోల్, సీఎన్జీ, డీజిల్ వెహికల్స్ కంటే మెరుగైన పనితీరు ఎరిక్ మోడల్ వాహనం కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రైవర్లు, ఓనర్లు తక్కువ చార్జింగ్‌తోనే తమ వాహనాలు పని చేస్తాయని, చౌక ధరకే లభిస్తాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సౌరబ్ మార్కండేయ తెలిపారు. 

ఎరిక్ వెహికల్స్ టెంపరేచర్ -25 నుంచి 60 డిగ్రీల సెల్సియస్ వరకు టెంపరేచర్ ఉంటుంది. మిగతా వాహనాలతో పోలిస్తే ఎరిక్ వాహనానికి కిలోమీటర్‌కు రూ.1.50 ఖర్చవుతుంది. ఎరిక్ వాహనంలో అమర్చే పవర్ ట్రైన్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్నానంతో తయారుచేసిన ఎలక్ట్రాన్స్‌తో రూపొందిస్తారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios