ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడాలో కాదు అవి పేలినప్పుడు ఎలా ప్రాణాలతో బైటపడాలో వాహనదారులు తెలుసుకోవాలి. లేదంటే భవిష్యత్ లో ఈవి వాహనాలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతాాయి. 

అపార్ట్మెంట్ లో బాంబు..!

ఎలక్ట్రిక్ మోటార్ వాహనాల వినియోగం పెరుగుతోంది.

వీటిని ఎలా ఛార్జింగ్ చెయ్యాలో... ఎలా వినియోగించాలో ఎంత మందికి తెలుసు అనేది ప్రశార్థకం.

ఇండియాలో వాడే సాంకేతిక పరిజ్ఞానం ఎలాంటిది..? వేడి వావరణం ఉన్న మన దేశానికి ఇవి ఎంత వరకు సరిపోతాయి అనేవి చర్చించాల్సిన అంశాలు.

వీటిని ఎలా ఛార్జింగ్ చెయ్యాలి అనేది ఎంత మందికి తెలుసు..?

ఛార్జింగ్ ను 80 % దగ్గరే ఆపేయాలి అనే విషయం తెలుసా..?

"థర్మల్ రన్ అవే" అనే మాట విన్నారా..?

"SCBA హజమత్ గేర్" గురించి తెలుసా ?

మీకు దగ్గర్లో ఎలక్ట్రిక్ మోటార్ బ్లాస్ట్ (కాలి పోవడం) జరిగింది.

అప్పుడు మీరేమి చెయ్యాలి..?

బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతం నుంచి కనీసం 200 మీటర్లు పారిపోండి. కారులో ఉన్నవారు గరిష్ఠంగా 60 సెకండ్స్ లో బయట పడాలి. మీ ఫోన్, బ్యాగ్గులు కార్లోనే వదిలేసేయండి. పారిపోవటం ముఖ్యం. గుర్తుపెట్టుకోండి.. కార్ నుంచి బయటకు రావడం కాదు. అరవై సెకండ్స్ లో మీరు కనీసం వంద మీటర్లు పారిపోవడం ముఖ్యం. లేదంటే వేడికి అంత కన్నా మించి ... అక్కడ వెలువడే వాయువులకు బలైపోగలరు. HF వాయువు సాంద్రత ఎక్కువ .. అది భయానక విషం. ఫైర్ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయండి. ఎలక్ట్రిక్ మోటార్ బ్లాస్ట్ అని స్పష్టంగా చెప్పండి. వారు ప్రత్యేక దుస్తుల్లో రావాలి. సాధారణ దుస్తులు పనికి రావు.

ఎటువంటి పరిస్థితుల్లో ... కాలిపోతున్న ఎలక్ట్రిక్ మోటార్ వాహనం నిప్పు ఆర్పడానికి... దగ్గరకు వెళ్లొద్దు . వెళితే మీరు తిరిగొచ్చే అవకాశం లేదు. అక్కడ 600 డిగ్రీల వేడి... అంతకు మించి HF గ్యాస్ క్లౌడ్.. చంపేస్తుంది. నీటితో వాహనం ఆర్పడానికి ప్రయత్నించవద్దు. మీరు బకెట్ లాంటివాటితో ఉపయోగించే నీరు ఎక్కడికీ సరిపోదు. పైగా నీరు అక్కడ విడుదలయిన విష వాయువును మీ మొఖంపైకి తెస్తుంది. క్షణంలో స్పృహ తప్పి పడిపోవడం ఖాయం.

మంటలు ఆర్పడానికి కారులోని ఫైర్ EXTINGUISHER వాడొద్దు. ఇది బాటరీ RUNAWAY. పౌడర్ ఆధారిత నిప్పు ఆర్పే యంత్రం పని చెయ్యదు . మీరు పారిపోవడం ముఖ్యం. ఫైర్ డిపార్ట్మెంట్ వారు మంటలు ఆర్పి వెళ్ళిపోయాక మళ్ళీ అది రీ IGNITE కావొచ్చు . అంటే తిరిగీ మంటలు అంటుకొంటాయి . 24 నుంచి 48 గంటలు ఈ ప్రమాదముంటుంది. కాబట్టి మంటలు ఆరిపోయాయి కదా అని దగ్గరకు పోకండి. ఒక సారి బ్లాస్ట్ అయితే అది పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబు. రెండు రోజుల్లో ఎప్పుడైనా తిరిగీ పేలిపోతుంది. కారణం లోపల సెల్స్ ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండి ఒకదానినొకటి అంటించేస్తాయి . దీన్నే రన్ అవే అంటారు. బయట మంట లేకపోయినా లోపల వేడి.. అదీ అధిక వేడి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి రెండు రోజులు. దాని దగ్గరకి వెళ్ళకూడదు. 

అపార్ట్మెంట్ సెల్లర్ లో బ్లాస్ట్ జరిగితే వెంటనే అపార్ట్మెంట్ లో ఉన్నవారు అందరూ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలి. లిఫ్ట్ వాడొద్దు. మీ అపార్ట్మెంట్ లో ఇలాంటి వెహికల్స్ ఛార్జింగ్ జరగకుండా చూసుకోండి.