- Home
- Business
- Auto Driver: ఈ ఆటో డ్రైవర్ సంపాదన నెలకు రూ.3 లక్షలు, ఇతనికున్న ఆస్తులు తెలిస్తే ఆశ్చర్యపోతారు
Auto Driver: ఈ ఆటో డ్రైవర్ సంపాదన నెలకు రూ.3 లక్షలు, ఇతనికున్న ఆస్తులు తెలిస్తే ఆశ్చర్యపోతారు
అతడు చేసేది ఆటో డ్రైవర్ (Auto Driver) ఉద్యోగం. అయినా కూడా లక్షల్లో సంపాదిస్తున్నాడు. బెంగళూరులో ఏదైనా సాధ్యమేనని ఇతని కథ మరొకసారి నిరూపిస్తోంది. ఇంతకీ ఈ ఆటో డ్రైవర్ కథ ఏంట తెలుసుకోండి.

వైరల్‌గా ఆటో డ్రైవర్ కథ
గుండెను కదిలించే ఏ కథ అయినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. అలా ఎక్స్ లో ఒక యూజర్ ఆటో డ్రైవర్ కథను పోస్ట్ లో పెట్టారు. తాను బెంగళూరులో ఒక ఆటో ఎక్కానని చెప్పారు. ఆటో డ్రైవర్ చేతికి ఆపిల్ వాచ్ ఉండడం, ఆపిల్ హెడ్ ఫోన్స్ వాడడం చూసి ఆశ్చర్యం వేసిందని వివరించాడు. అలా ఆటో డ్రైవర్ తో మాటలు కలిపానని తెలిపాడు. అతని మాటల్లో ఆటో డ్రైవర్ సంపాదన, అతనికున్న ఆస్తులు తెలుసుకొని షాక్ అయినట్టు వివరించాడు.
ప్రతి నెలా లక్షల సంపాదన
ఆటో డ్రైవర్ తాను ప్రతినెలా రెండు నుండి మూడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పారు. అంటే ఒక పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంపాదించే జీతంతో ఈ ఆదాయం సమానం. అలాగే బెంగళూరులో తనకు నాలుగు నుండి ఐదు కోట్ల రూపాయలు విలువైన రెండు ఇల్లు కూడా ఉన్నాయని చెప్పాడట ఆటోడ్రైవర్. తనకు వస్తున్న ఆదాయంలోంచి కొంత భాగాన్ని దాచిపెట్టి ఒక ఏఐ స్టార్టప్ లో పెట్టుబడి కూడా పెట్టినట్టు చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే బెంగళూరులాంటి బిజీ సిటీలో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు కూడా అధిక మొత్తంలోనే సంపాదిస్తున్నారు. అక్కడ జనాభా అధికంగా ఉండడం, ముఖ్యంగా ఐటీ సెక్టార్ మొత్తం బెంగళూరులోనే తిష్ట వేసుకుని కూర్చోవడం వల్ల క్యాబ్ సర్వీసులు, ఆటో సర్వీసులకు భారీగా లాభాలు వస్తున్నాయి.
రియాక్షన్లు ఇలా
ఎక్స్ లో ఈ పోస్టు పెట్టగానే ఎంతోమంది స్పందించారు. కొంతమంది అతను ఆటో నడపడం మానేసి స్టార్టప్ వ్యవస్థాపకులతో నెట్ వర్కింగ్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు ఎప్పుడో నగర శివారులలో భూమి కొనుగోలు చేసిన డ్రైవర్లు కూడా ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయారులే అని తమ అభిప్రాయాన్ని చెప్పారు.
నిజమైన కథ
ఈ కామెంట్లకు ఆకాష్ రిప్లై ఇస్తూ ఈ కథను ఎవరో తనకు చెప్పలేదని, నేరుగా ఆ ఆటో డ్రైవర్ తో తానే మాట్లాడి నిర్ధారించుకున్నాకే ఎక్స్ లో పోస్ట్ చేశానని తెలిపాడు. కొంతమంది నెటిజన్లు బెంగళూరులో ఏదైనా సాధ్యమే, ఆటో రైడ్ కూడా చాలా ఖరీదైనదే అని రాసుకొచ్చారు. నిజమే ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో అన్ని వస్తువులు ఖరీదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అక్కడ చాలా ఎక్కువ.