విద్యుత్ వాహనాలతో ఫోర్జింగ్ కంపెనీల ఉనికి ప్రశ్నార్థకమే

Electric vehicles in India will have an adverse impact: Forging industry
Highlights

భారతదేశంలో విద్యుత్ వాహనాలతో ఆటోమొబైల్ రంగంలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయని పోర్జింగ్ ఇండస్ట్రీ చెబుతోంది.

న్యూఢిల్లీ: భారతదేశంలో విద్యుత్ వాహనాలతో ఆటోమొబైల్ రంగంలో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయని పోర్జింగ్ ఇండస్ట్రీ చెబుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ పోర్జింగ్ పరిశ్రమ బలమైన అభివృద్ధి సాధించినా ‘ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) దిశగా’ కేంద్రం ద్రుష్టి సారించిన నేపథ్యంలో ముప్పు పొంచి ఉన్నదని పారిశ్రామిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పెట్రోల్, డీజిల్ వినియోగంతో నడిచే ఆటోమొబైల్ వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాల్లో ఇంజిన్ ఉండనే ఉండవు. విడి పరికరాలను పూర్తిగా మార్చేయాల్సిందే’ అని పారిశ్రామిక శాఖ అధికారి చెప్పారు. పెట్రోల్, డీజిల్ వినియోగంతో నడిచే అంతర్గతంగా ఇంధనాన్ని మండించే ఇంజిన్‌లో సుమారు రెండు వేల విడిభాగాలు ఉంటాయి. విద్యుత్ వాహనాల్లో కేవలం 20 విడి భాగాలు మాత్రమే ఉంటాయి.

విద్యుత్ వాహనాల రంగ ప్రవేశంతో సుదీర్ఘ కాలంలో పోర్జింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఆటోమొబైల్ పరికరాల్లో 60 శాతం ఫోర్జింగ్ యూనిట్లలో తయారవుతాయి. ప్రత్యేకించి ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ సంబంధిత అప్లికేషన్లలో వీటి ప్రభావం తప్పక ఉంటుందని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫోర్జింగ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఎస్ మురళి శంకర్ తెలిపారు. 

విద్యుత్ వినియోగ వాహనాల్లో కేవలం స్టీరింగ్ కాంపొనెంట్లు, యాక్సిల్స్ ఉంటాయి. ఫలితంగా 40 - 50 శాతం పోర్జింగ్ ఆటో పరికరాల తయారీ సంస్థలు మూతపడాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫోర్జింగ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఎస్ మురళీ శంకర్ తెలిపారు. ఫలితంగా ఆయా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది నిరుద్యోగులుగా మారుతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ వాహనాల ఉత్పత్తిపైనే కేంద్రీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు పెరిగాయని మురళీ శంకర్ తెలిపారు. 

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపిన వివరాల ప్రకారం గతేడాది ఏప్రిల్ - మే నెలలో 6.35 లక్షల యూనిట్ల వాహనాలు విక్రయించగా, గత ఏప్రిల్ - మే నెలల్లో 7.06 లక్షల వాహనాలు విక్రయాలు జరిగాయని మురళీ శంకర్ గుర్తు చేశారు. ఆటోమొబైల్ ఉత్పాదక రంగంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న ఫోర్జింగ్ పరిశ్రమ.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదిత ‘మేకిన్ ఇండియా’ విధానంలో కీలక భూమిక పోషించిందని మురళీ శంకర్ గుర్తు చేశారు.

loader