Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ విచారణ.. నివేదిక తర్వాత తీవ్ర చర్యలు: నితిన్ గడ్కారీ

గత వారం రోజుల్లో ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)లో నాలుగు అగ్నిప్రమాద ఘటనలను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, ఫోరెన్సిక్ విచారణ తర్వాత తయారీదారులపై తగిన చర్యలు తీసుకుంటామని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

E scooter fires Govt orders forensic probe to take action after report
Author
Hyderabad, First Published Apr 1, 2022, 1:21 PM IST

గత వారంలో జరిగిన నాలుగు ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల (EV) అగ్నిప్రమాదాలను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, ఫోరెన్సిక్ విచారణ తర్వాత తయారీదారులపై తగిన చర్యలు తీసుకుంటామని రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్‌సభకు తెలిపారు. మార్చి 25 వరకు దేశంలో 10,76,420 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని, 1,742 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.

"గత ఒక వారంలోనే ద్విచక్ర వాహనాలలో మొత్తం నాలుగు సంఘటనలు జరిగాయి, ఇది చాలా తీవ్రమైన సమస్య. మేము సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES), DRDO అండ్ IISc, బెంగళూరు నుండి నిపుణులను సంప్రదించాము, ప్రతి సంఘటనపై ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించబడింది." అని ప్రశ్న సమయంలో చెప్పారు. 

ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల ఆమోదం కోసం భారతదేశ ప్రమాణాలు ప్రపంచ ప్రమాణాల ప్రకారం ఉన్నాయని, ప్రమాదాల వెనుక ఉన్న ఖచ్చితమైన సాంకేతిక కారణాన్ని నిర్ధారించిన తర్వాత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత దాని వెనుక ఉన్న కారణాలేమిటో తేలుస్తామని, ఆ నివేదిక ఆధారంగా తయారీదారులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అయితే, ఈ ఘటనలకు స్పష్టమైన కారణం చాలా ఎక్కువ ఉష్ణోగ్రత అని తాను గ్రహించినట్లు మంత్రి గడ్కరీ చెప్పారు. సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (CFEES) అనేది DRDO ల్యాబ్  SAM (సిస్టమ్స్ అనాలిసిస్ అండ్ మోడలింగ్) క్లస్టర్‌లో భాగం. మరో అనుబంధ ప్రశ్నకు గడ్కరీ సమాధానమిస్తూ, పర్యావరణం, పర్యావరణ పరిరక్షణపై పారిస్ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.

జాతీయ రహదారులపై 650 రోడ్ సైడ్  సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, అందులో 40 పనులు ప్రారంభించినట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios