Asianet News TeluguAsianet News Telugu

భారత మార్కెట్ లోకి బిఎమ్‌డబ్ల్యూ బైకులు, అందుబాటు ధరల్లోనే...

సంపన్నుల కోసమే అన్నట్లుగా ఖరీదైన కార్లను తయారుచేసే బిఎమ్‌డబ్ల్యూ సంస్థ టూ వీలర్ల తయారీ విభాగంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బీఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ రెండు సూపర్ బైక్ లను లాంచ్ చేసింది. జి310ఆర్ మరియు జి310జిఎస్ బైకులను భారత విపణిలోకి బిఎమ్‌డబ్ల్యూ విడుదల చేసింది. అయితే వీటిని కాస్త తక్కువ ధరలకే వినియోగదారులకు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ - రూ. 2.99 లక్షలు, బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ - రూ. 3.49 లక్షలకు (ఎక్స్ షోరూం ధరలు) ధరకు మార్కెట్ లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

BMW G 310R and G310 GS India Launch

అయితే ఈ మోడల్  బైక్ లను ప్రత్యేక బుకింగ్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు బిఎమ్‌డబ్ల్యూ సంస్థ తెలిపింది. ఇప్పటికే చాలామంది ఔత్సాహికిలు ముందుగానే రూ.50 వేలు చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. ఈ రెండు మోడల్స్ కూడా మూడు విభిన్న రంగుల్లో మార్కెట్లో  లభ్యమవుతున్నాయి. అవి రేసింగ్ రెడ్, పర్ల్ వైట్ మెటాలిక్, కాస్మిక్ బ్లూ. 

ఇక  వీటి సాంకేతిక అంశాలను పరిశీలిస్తే...రెండిట్లోనూ 313 కెపాసిటీ సింగల్ సిలిండర్ ఇంజన్ ను వాడారు.  బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ తో పాటు బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ మోడల్లలో ముందు చక్రానికి 300ఎమ్ఎమ్ మరియు వెనుక చక్రానికి 200ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ అందించారు.  బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకు మొత్తం బరువు 158.5కిలోలు కాగా,  జి310 జిఎస్ బరువు 169.5 కిలోలుగా ఉంది.

ఇప్పటివరకు బిఎమ్‌డబ్ల్యూ నుండి వచ్చిన అత్యంత తక్కువ ధరగల బౌక్ లుగా ఈ రెండు మోడళ్లు నిలిచాయి. సామాన్య, మధ్యతరగతి వర్గానికి చెందిన ఔత్సాహికులకు కూడా అందుబాటులో ఉండేందుకు ఇలా తక్కువ ధరల్లో, ఎక్కువ సాంకేతికతతో ఈ బైక్ లను రూపొందించినట్లు ప్రతినిధులు తెలిపారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios