Asianet News TeluguAsianet News Telugu

బజాజ్ చేతక్ మళ్లీ భారత మార్కెట్లోకి రానుందా?

బజాజ్ చేతక్...పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ కు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చిన వాహనం. ఈ చేతక్ ను ఆదారంగా చేసుకునే ఇప్పుడున్న స్కూటీలు మార్కొట్లోకి వచ్చాయనడం అతిశయోక్తి కాదేమో. అయితే మార్కెట్ లో చోటుచేసుకున్న విస్తవాత్మక మార్పుల కారణంగా ఈ చేతక్ కాలగర్భంలో కలిసిపోయింది. అయితే మళ్లీ దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చి మరోసారి ఆటోమొబైల్ రంగంలో ప్రభంజనం సృష్టించాలని బజాజ్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

bajan chetak reentry in indian market

బజాజ్ చేతక్...పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ కు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చిన వాహనం. ఈ చేతక్ ను ఆదారంగా చేసుకునే ఇప్పుడున్న స్కూటీలు మార్కొట్లోకి వచ్చాయనడం అతిశయోక్తి కాదేమో. అయితే మార్కెట్ లో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పుల కారణంగా ఈ చేతక్ కాలగర్భంలో కలిసిపోయింది. అయితే మళ్లీ దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చి మరోసారి ఆటోమొబైల్ రంగంలో ప్రభంజనం సృష్టించాలని బజాజ్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

చాలా ఏళ్ల క్రితమే అత్యంత ఆదరణ పొందిన మోడల్ బజాజ్ చేతక్. అయితే ఆ తర్వాత ఆ తరహాలో ప్రజాధరణ పొందిన మోడల్ మరొకటి లేదు. బజాజ్ నుండి పల్సర్ కూడా మంచి ప్రజాధరణ పొందింది. కానీ చేతక్ స్థాయిలో కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాటి చేతక్ ని నేటి తరానికి తగ్గట్లు తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేయాలని బజాజ్ సంస్థ భావిస్తోంది. 2019లో దేశీయంగా తమ చేతక్ స్కూటర్లను అధికారికంగా విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నూతన చేతక్ ను క్లాసికల్ లుక్ తో, 125 సిసి ఇంజన్ తో తయారుచేసి అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందించాలని బజాజ్ భావిస్తుంది. అంటే దాదాపు రూ. 70 వేల లోపు ధరతో వినియోగదారులకు అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బజాజ్ చేతక్ ఎలాంటి డిజైన్ స్టైల్లో, ఎలాంటి ఇంజన్ మరియు ఫీచర్లతో వస్తుందో అని అందరిలో తీవ్ర ఆసక్తి నెలకొంది.  ఈ ఆసక్తికి తెరపడాలంటే 2019 వరకు ఆగాల్సిందే.

Follow Us:
Download App:
  • android
  • ios