Asianet News TeluguAsianet News Telugu

Auto Expo 2023: ఆటో ఎక్స్‌పోలో ఇండియన్ కంపెనీ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌.. దానికదే బ్యాలెన్స్ చేస్తుంది..

మీడియా నివేదికల ప్రకారం, సెల్ఫ్ -బాలెన్సింగ్ టెక్నాలజి ప్రాడక్ట్ సిద్ధంగా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రారంభమవుతుందని లిగర్ మొబిలిటీ తెలిపింది.
 

Auto Expo 2023:smart electric scooter will make balance by itself
Author
First Published Jan 10, 2023, 6:07 PM IST

ఆటో ఎక్స్‌పో 2023 చాలా విధాలుగా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇందులో పెద్ద కంపెనీల నుండి వారి ప్రస్తుత ఉత్పత్తులతో పాటు ఫ్యూచర్ టెక్నాలజి  ప్రత్యేక ఉత్పత్తుల గ్లింప్స్ చూడవచ్చు. దీనితో పాటు ఎన్నో స్టార్టప్‌ల నుండి కొత్త టెక్నాలజీతో కూడిన వాహనాలను కూడా చూడవచ్చు. ముంబైకి చెందిన స్టార్టప్ లైగర్ అలాంటి టెక్నాలజీతో ముందుకు వస్తోంది.

మీడియా నివేదికల ప్రకారం, సెల్ఫ్ -బాలెన్సింగ్ టెక్నాలజి ప్రాడక్ట్ సిద్ధంగా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రారంభమవుతుందని లిగర్ మొబిలిటీ తెలిపింది.

డిజైన్ ఎలా ఉంటుందంటే 
లైగర్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మాట్లాడితే దీని డిజైన్ వెస్పా క్లాసిక్ ఇంకా యమహా ఫాసినో లాగా కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెట్రో స్టైల్‌లో  తీసుకువస్తోంది. స్కూటర్ ముందు, డెల్టా ఆకారంలో ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్ ఇచ్చారు ఇంకా ఎల్‌ఈ‌డి DRLలు కూడా ఇందులో కనిపిస్తాయి.

ఫీచర్లు ఎలా ఉంటాయంటే 
 కంపెనీ ఇంకా దీని గురించి పూర్తి సమాచారం ఇవ్వలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం, దీనికి పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్‌ఈ‌డి టెయిల్‌లైట్లు, అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఇవ్వవచ్చు. వీటితో పాటు సెల్ఫ్ పార్కింగ్, అడ్వాన్స్ రైడర్ సేఫ్టీ అసిస్ట్, లెర్నర్ మోడ్ ఇంకా రివర్స్ ఫంక్షన్ స్కూటర్‌లో చూడవచ్చు.

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో స్కూటర్ ఫ్రేమ్‌లు కంటిన్యూ గా ఆక్టివ్ ఉంటాయి. ఇవి మోటార్లు ఇంకా సెన్సార్లతో స్కూటర్  వంపుని గ్రహిస్తాయి, వీటిని వీల్స్ లో కూడా ఉపయోగించారు.  

ధర ఎంత ఉంటుంది
ప్రస్తుతం దీని పై కంపెనీ అధిక సమాచారం కంపెనీ ఇవ్వలేదు. అయితే ఆటో ఎక్స్‌పో సందర్భంగా దీని గురించి మరింత  సమాచారం కంపెనీ ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios