డ్రైవింగ్ ఆండ్ సేప్టీ విభాగంలో...
ఉన్నత వర్గాలకు, సెలబ్రెటీలను మాత్రమై దృష్టిలో పెట్టుకుని కార్లను తయారు చేసే కంపెనీల్లో ఆడి కంపెనీ ముందుంటుంది. అయితే దర్పాన్ని ప్రదర్శించడానికి కాకుండా ప్రయాణికుల సేప్టీ పై కూడా ఈ కంపెనీ తగిన జాగ్రత్త వహిస్తుంది. అందుకు నిదర్శనమే తాజాగా ఈ కంపెనీ రూపొందించిన అత్యంత లగ్జరీ కారు ఒకటి ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకోవడం.
ఆడీ కంపెనీకి చెందిన ఏ8 మోడల్ కేవలం సెలెబ్రెటీలు,సంపన్నుల కారుగా పేరుంది. అయితే ఇందులో ప్రయాణించేది సెలబ్రిటీలు లేదా బడా వ్యాపారవేత్తలే కావడంతో ఈ కారుని రక్షణాపరంగాను అత్యాధునికంగా రూపొందించారు. దీంతో ఆటోమొబైల్ రంగానికి చెందిన 1,296 ఆవిష్కరణలు, అరవై బ్రాండ్ లను కాదని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డును ఈ మోడల్ కైవసం చేసుకుంది.
అటానమస్ డ్రైవింగ్ మరియు సేఫ్టీ విభాగంలో ‘మోస్ట్ ఇన్నోవేటివ్ మోడల్ ఆఫ్ ది ఇయర్ 2018’ అవార్డును ఆడీ ఎ8 మోడల్ కారు కైవసం చేసుకుంది. సెంటర్ ఆఫ్ ఆటోమోటివ్ మేనేజ్‌మెంట్, ప్రైస్‌వాటర్‌హౌజ్ కూపర్స్ ఏజి సంస్థలు అందించే ఆటోమోటివ్ ఇన్నోవేషన్ అవార్డుల్లో భాగంగా ఆడీ ఎ8 ని ఈ పురస్కారానికి ఎంపిక చేశాయి.
