అశోక్‌ లేలాండ్‌ లాభాల్లో క్షీణత...87% తగ్గిన...

2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో  నికర లాభం 86.68 శాతం క్షీణించి రూ .57.11 కోట్లకు చేరుకుందని హిందూజా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అశోక్ లేలాండ్ బుధవారం తెలిపింది. 

ashok leyland profits collapsed rs 57crores

హిందుజా గ్రూపునకు చెందిన వాహన విక్రయ సంస్థ అశోక్‌ లేలాండ్‌ మూడో త్రైమాసికానికిగాను రూ.57.11 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో  నికర లాభం 86.68 శాతం క్షీణించి రూ .57.11 కోట్లకు చేరుకుందని హిందూజా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అశోక్ లేలాండ్ బుధవారం తెలిపింది. 2018-19 డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 428.76 కోట్ల రూపాయలను నమోదు చేసింది.

also read ముగిసిన ఆటో ఎక్స్‌పో 2020 షో...సందర్శకుల అనూహ్య రెస్పాన్స్...

మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ .5,188.84 కోట్లకు తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే రూ .7,489.64 కోట్లు  అశోక్ లేలాండ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపారు.

"పరిశ్రమ వాల్యూమ్ (39 శాతం) క్షీణతను కొనసాగించింది. ఈ త్రైమాసికంలో కూడా అశోక్ లేలాండ్  వాల్యూమ్ పడిపోయింది" అని అశోక్ లేలాండ్ ఎండి, సిఇఒ విపిన్ సోంది చెప్పారు.

2020 ఏప్రిల్ గడువుకు ముందే కంపెనీ తన హెవీ డ్యూటీ బిఎస్-VI వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తోంది.

also read మార్కెట్లోకి కొత్త బజాజ్ పల్సర్ 150 బైక్స్.. ధరెంతంటే..?

"బిఎస్- VI వాహనాల రోల్-అవుట్ తో పాటు, మేము మా ప్రత్యేకమైన మాడ్యులర్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రవేశపెడతాము. అది మా వినియోగదారులకు వారి అవసరాలకు అనుగుణంగా వాహనాలను సెలెక్ట్ చేసుకునే సౌలభ్యాన్ని ఇస్తుంది" అని విపిన్  సోంది చెప్పారు.

అశోక్ లేలాండ్ షేర్లు బుధవారం బిఎస్‌ఇలో 1.81 శాతం తగ్గి రూ .81.35 వద్ద ముగిశాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios