jeep willys:1960 జీప్ మోడల్ ధర తగ్గింపు, అవి 'అద్భుతమైన పాత రోజులు': ఆనంద్ మహీంద్రా

ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాల్లో ఒకటైన జీప్  దశాబ్దాల నాటి ప్రకటనను గుర్తు చేసుకుంటూ షేర్ చేశారు.
 

Anand Mahindra Reminisces 'Good Old Days' When Company Jeep Cost Rs 12,000

దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా చైర్‌పర్సన్ నేడు తన పాత రోజుల జ్ఞాపకాలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.  1960లో కంపెనీ  ప్రకటన ఫోటోని షేర్ చేస్తూ  'గుడ్ ఓల్డ్ డేస్, వెన్ ప్రైసెస్ హేడెడ్ ఇన్ రైట్ డైరక్షన్ ' అంటూ ట్వీట్ చేశారు.

 ఆనంద్ మహీంద్రా రెండు కారణాల వల్ల జనాదరణ పొందారు. మొదటిది అతను మహీంద్రా గ్రూప్ చైర్మన్ కావడం, రెండవది ట్విట్టర్‌లో ఆక్టివ్ గా ఉండడం. ఆనంద్ మహీంద్రా, 'దశాబ్దాలుగా మా వాహనాలను పంపిణీ చేస్తున్న ఒక స్నేహితుడు అతని ఆర్కైవ్‌ నుండి ఈ (యాడ్ ఫోటో) కనుగొన్నాడు. ఆ   పాత రోజులు... ధరలు సరైన దిశలో పయనిస్తున్నప్పుడు.' ఈ ప్రకటన 1960 సంవత్సరం నాటిది.

ఈ ఫోటో జీపు వాహన ధరల తగ్గింపు గురించి తెలియజేసే ప్రకటన. దీని ప్రకారం కంపెనీకి చెందిన 'విల్లిస్ మోడల్ సీజే 3బీ జీప్' ధర రూ.200 తగ్గింది. ఈ ట్వీట్‌కి ఇప్పటి వరకు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.  ఇంత చౌక ధరకు లభించిన విల్లీస్ సీజే 3బీ జీప్ నేడు రూ.4.5 లక్షలకు పైగానే పలుకుతోంది.

జీప్ CJ-3B 15ని 1949 నుండి 1964 వరకు ఉత్పత్తి చేసింది. 1968 సంవత్సరం నాటికి ఈ మోడల్ చెందిన ఒక లక్షా 55 వేల జీపులు అమ్ముడయ్యాయి. 

ఒక ట్విటర్ వినియోగదారుడు ఆనంద్ మహీంద్రాను 1960లో ఉన్న ధరకే 2 వాహనాలను బుక్ చేయమని అడగాగా, తక్కువ ధర రోజులను తిరిగి తీసుకురావాలని అభ్యర్థించారు. దీనికి మహీంద్రా సరదాగా స్పందిస్తూ తాను 10 కార్లను అంత ధరకు కొనుగోలు చేయగలనని, అవి నిజమైన వాటికి బదులుగా బొమ్మల సేకరణకు సరిపోతాయని అన్నారు.

పాత ధరకు జీప్‌ను పొందడంపై పలువురు ఎగతాళి చేయగా, మరికొందరు వాహనంతో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఒక వినియోగదారుడు వారు ఆ జీప్ ని కాలేజీకి తీసుకెళ్లేవారని పేర్కొన్నారు. మరొకరు బ్రిడ్జిపై వెనుక నుంచి ఓ కారు జీప్ వాహనాన్ని ఢీకొట్టిందని తెలిపారు. అయితే జిప్ కు ఏమీ జరగలేదని, దానిని క్రాష్ చేసిన వ్యక్తి అతని కార్ బానెట్‌ను మార్చుకోవడానికి మంచి మొత్తాన్ని వెచ్చించి ఉంటాడని చెప్పాడు.

మరొక వినియోగదారు తన 1965 టూరర్ CJ 3bని గ్యారేజీలో మరమ్మతులు చేపిస్తున్నట్టు చూపించాడు. ఆ ఇంజన్స్ శాశ్వతంగా ఉండేలా నిర్మించబడ్డాయని పేర్కొన్నాడు. 2022 మహీంద్రా థార్ తాజా వెర్షన్ ధర రూ. 13.17 - 15.53 లక్షల మధ్య ఉంటుంది(ఎక్స్-షోరూమ్ ధర)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios