Anand Mahindra: ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర ట్వీట్‌.. రూ. 12 వేల‌కే జీప్ కారు..!

ఇండియా ప్రొడక్ట్ అయిన మహీంద్రా.. ప్రపంచంలోనే బెస్ట్ ఆటోమొబైల్ బ్రాండ్. ప్రత్యేకించి 2022లో బాగా అమ్మకాలు జరుపుతున్న ఈ బ్రాండ్ వెహికల్ ను 1960 నాటి జీప్ తో పోల్చుతూ ట్వీట్ చేశారు మహీంద్రా. 

Anand Mahindra looks back on good old days

ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఈయన. అలాగే దేశీ దిగ్గజ వ్యాపారవేత్తలో ఒకరు. ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన శైలితో పలు రకాల అంశాలపై ట్వీట్లు చేస్తుంటారు. అందుకే ఈయనకు సోషల్ మీడియాలో కూడా ఫాలోయింగ్ బాగుంటుంది. ఇప్పుడు కూడా ఒక ట్వీట్ చేశారు. ఇది వైరల్ అయిపోయింది.

ఆనంద్ మహీంద్రా జీప్ కారుకు సంబంధించిన ఒక ట్వీట్ చేశారు. ఇది 1960 కాలం నాటి ఒక అడ్వర్టైజ్‌మెంట్. ఇందులో జీప్ కారు ధరపై రూ.200 తగ్గింపు ఇచ్చారు. దీంతో జీప్ కారు ధర కూ.12,421కు తగ్గింది. అంటే అప్పుడు రూ.12,421 చెల్లించి జీప్ కారును కొనుగోలు చేయొచ్చు. ఈ అంశాన్ని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఒక మంచి స్నేహితుడు ఈ అడ్వర్టైజ్‌మెంట్‌ను తన ఆర్కేవ్స్ నుంచి తీసిచ్చారని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అతని కుటుంబం చాలా కాలంగా తమ వాహనాలను పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. పాత రోజులు బాగున్నయని గుర్తుకు చేసుకున్నారు.

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆనంద్ మహీంద్రా ఫోలోవర్లలో ఒకరు తన కోసం దయ చేసి ఆ పాత కాలం నాటి ధరతోనే రెండు జీప్ కార్లు బుక్ చేయాలంటూ రిప్లే ఇచ్చారు. అలాగే మరో నెటిజన్.. రూ.12,421కు ఇప్పుడు ఫ్లోర్‌ మ్యాట్స్, పర్‌ఫ్యూమ్ బాటిల్, డస్ట్ కవర్, కారు ట్యాంక్ ఫుల్ చేసుకోవడం వంటి వాటికి సరిపోతుందని ఫన్నీ రిప్లే ఇచ్చారు. అలాగే మరి కొందరు ఈ రేటుకు చిన్న బొమ్మ కారు వస్తుందంటూ కామెంట్ చేశారు. ఈ విధంగా ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్ అయిపోయింది. కాగా మరోవైపు మన దేశం నుంచి ఉక్రెయిన్‌కు వెళ్లి వేల మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా దేశంలో మెడికల్ కాలేజీల కొరతపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో ఈయన మెడికల్ కాలేజీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios