న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ భారతదేశ విపణిలోకి సరికొత్త 2019 సుజుకీ జిక్సర్‌ 155 మోటార్‌సైకిల్‌ని శుక్రవారం విడుదల చేసింది. దీని ధర రూ. 1,00,212 గా ఉంది. 155 సీసీ ఫోర్‌ స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌, ఫ్యూయల్ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌, 8000 ఆర్‌పీఎం వద్ద 14 ఎన్‌ఎం టార్చ్‌, 13.9 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 

5-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌, సింగిల్‌ చానెల్ యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ ఇందులో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మెటాలిక్‌ సోనిక్‌ సిల్వర్‌ &‌ గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌, గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ & మెటాలిక్‌ ట్రైటన్‌ బ్లూ, గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ లాంటి మూడు రంగుల్లో ఈ మోడల్‌ అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.

ఎస్ఈపీ టెక్నాలజీతో ఎయిర్ కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఇంజిన్ కలిగి ఉంటుంది. న్యూ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్టైలిష్ విత్ షార్ప్, చిసెల్లెడ్ అండ్ స్లీక్ బాడీ వర్క్ తదితర అదనపు ఫీచర్లు ఉన్నాయి. 

‘భారత్‌లో ప్రీమియం స్పోర్ట్స్‌ మోటార్‌సైకిల్స్‌పై ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో దూకుడు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, శక్తిమంతమైన పనితీరుతో సరికొత్త సుజుకీ జిక్సర్‌ని భారత మార్కెట్లో విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు దేవాశిష్ చెప్పారు. 

జిక్సర్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ కావడంతో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా వేగంగా వృద్ధి చెందుతోందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు దేవాశిష్ చెప్పారు. మోటార్‌ సైక్లింగ్‌ అభిమానులకు అద్భుతమైన రైడింగ్‌ అనుభూతిని ఈ మోడల్‌ అందిస్తుందని తెలిపారు.

ఈ ఏడాది మేలో ఆల్ న్యూ జిక్సర్ 250, అప్ డేటెడ్ జిక్సర్ ఎస్ఎఫ్ బైక్‌లను సుజుకి మోటారు సైకిల్స్ ఆవిష్కరించింది. ఈ బైక్‌తో ప్రతి రైడ్ ఉల్లాసాన్ని అందిస్తుందని సుజుకి మోటారు సైకిల్స్ భారత్ అధినేత కొచిరో హిరావో తెలిపారు.