మాధవి, సందీప్ లపై మనోహరాచారి అత్యంత పాశవికంగా దాడి చేస్తే మద్యం మత్తులో హత్యాయత్నం చేశాడని డీసీపీ శ్రీనివాస్ ఎలా చెప్తారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు తండ్రి చేతిలో దాడికి గురైన మాధవిని మందకృష్ణ మాదిగ పరామర్శించారు. డీసీపీ స్టేట్ మెంట్ పై మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు.